BigTV English

Ram Charan: రామ్‌చ‌ర‌ణ్ నెక్స్ట్ మూవీ పనులు స్టార్ట్

Ram Charan: రామ్‌చ‌ర‌ణ్ నెక్స్ట్ మూవీ పనులు స్టార్ట్

Ram Charan:రామ్‌చ‌ర‌ణ్ స్టెప్ బై స్టెప్ అన్నీ చ‌క్క‌బెట్టేసుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తూనే ఆచార్య ప‌నులు కంప్లీట్ చేశారు. ఆ త‌ర్వాత శంక‌ర్ సినిమా స్టార్ట్ చేశారు. చ‌క‌చ‌కా షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. మ‌రోవైపు తండ్రి కాబోతున్న గుడ్‌న్యూస్‌ని అభిమానుల‌తో పంచుకున్నారు. ఇప్పుడు అదే వ‌రుస‌లో ఇంకో విష‌యాన్ని కూడా చ‌క్క‌బెట్టేస్తున్నారు. అదే న‌ర్త‌న్ డైర‌క్ష‌న్‌లో ప్యాన్ ఇండియా సినిమా. క‌న్న‌డ డైర‌క్ట‌ర్ న‌ర్త‌న్ క‌థ‌ను అప్పుడెప్పుడో ఓకే చేశారు చ‌ర‌ణ్‌. యాక్చువ‌ల్‌గా కేజీయ‌ఫ్‌2 త‌ర్వాత న‌ర్త‌న్ డైర‌క్ష‌న్‌లో య‌ష్ చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆ ప్రాజెక్టును ఓకే చేసేశారు చ‌ర‌ణ్‌.


శంక‌ర్ సెట్స్ నుంచి నేరుగా బుచ్చిబాబు సెట్స్ కి వెళ్తారు చ‌ర‌ణ్‌. ఆ వెంట‌నే న‌ర్త‌న్‌తో సినిమా ఉంటుంది. మ‌ధ్య‌లోనే సుకుమార్ సినిమా కూడా ఉంటుంద‌ట‌. న‌ర్త‌న్ ఇప్పుడు బౌండ్ స్క్రిప్ట్ చేసే ప‌నిలో ఉన్నార‌ట‌. యువీ క్రియేష‌న్స్ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాలో య‌ష్ గెస్ట్ రోల్ చేస్తార‌నే మాట కూడా వినిపిస్తోంది. య‌ష్ జ‌స్ట్ గెస్ట్ రోల్ చేస్తారా? లేకుంటే చ‌ర‌ణ్ య‌ష్ అన్న‌ద‌మ్ములుగా క‌నిపిస్తారా? అనేది కూడా ప్ర‌స్తుతానికి స‌స్పెన్సే. అదే జ‌రిగితే న‌ర్త‌న్ డైర‌క్ష‌న్‌లో య‌ష్‌, చ‌ర‌ణ్ చేస్తున్నార‌ని ఇంత‌కు ముందు నుంచే జ‌రిగిన ప్ర‌చారం నిజ‌మైన‌ట్టే.

తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ‌లోనూ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇక‌పై ప్ర‌తిదీ ప్యాన్ ఇండియా సినిమాగా ఉండేట‌ట్టు ప్లాన్ చేసుకుంటున్నారు చ‌ర‌ణ్‌. 2023 ఎండింగ్‌లో షూటింగుల‌కు పెద్ద బ్రేక్ ఇవ్వాల‌నే ప్లాన్‌లో ఉన్నారు చ‌ర‌ణ్‌. పుట్ట‌బోయే బిడ్డ‌తో స‌మ‌యం గ‌డ‌ప‌డానికి బ్రేక్ తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట చెర్రీ.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×