Spy Camera In Girls Hostel: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్-కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్‌లోని లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా ఎగరడం ఇప్పుడు సంచనంగా మారింది. కిష్టారెడ్డి పేటలో మైత్రి విల్లాస్‌లో బండారు మహేశ్వర్ అనే వ్యక్తి లక్ష్మి గర్ల్స్ హాస్టల్ నడుపుతున్నాడు. సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధినులు ఈ హాస్టల్‌లో నివసిస్తూ చదువుకుంటున్నారు. అయితే శుక్రవారం హాస్టల్‌లో ఓ గదిలో అనుమానాస్పద వస్తువు గుర్తించడం కలకలం రేపింది. అదనపు ఛార్జర్‌లా ఓ వస్తువు కనిపించడంతో విద్యార్ధినులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హాస్టల్‌లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి అమీన్ పూర్ పోలీసులకు కంప్లైంట్ చేసారు. సమాచారం తెలుసుకున్న అమీన్ పూర్ పోలీసులు హాస్టల్‌కు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. స్పై కెమెరాలోని పలు చిప్స్‌ను పోలీసులు పరిశీలించారు.
విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇంట్లో భార్య, తల్లి గొడవ పడుతున్నారని మహేశ్వరరావు అనే వ్యక్తి మొదట ఇంట్లో స్పై కెమెరా పెట్టాడు. ఆ తర్వాత ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఓ కెమెరాను కొన్నాడు. దీని కోసం హాస్టల్ కిచెన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. అక్కడితో ఆగకుండా ఎవరికి తెలియకుండా అమ్మాయిల రూమ్‌లో కెమెరా పెట్టాడు మహేశ్వరరావు. కాగా.. ఓ యువతి కెమెరా చూసి పసిగట్టడంతో ఈ బాగోతం బయటపడింది.
Also Read: లాలాగూడ జంట హత్యల కేసు.. అక్రమ సంబంధమే కారణమా?
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ అమీన్‌పూర్‌లోని ఓ గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరాల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హాస్టల్‌లోని అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మైత్రి విల్లాస్ 75 లేడీస్ హాస్టల్ లో స్పై కెమెరాలున్నాయని గుర్తించడంతో.. అందులోని మహిళలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మరోవైపు పోలీసులు స్పై కెమెరాల్లోని చిప్‌ను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు 3 స్పై కెమెరాలు, చిప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమీన్‌పూర్ స్టేషన్‌లో నిందితుడ్ని విచారణ చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి సీక్రెట్ కెమరాలు పెట్టాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో ఎంక్వయిరీ చేపట్టిన పోలీసులు.. నిజా నిజాలు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.