Chiranjeevi:శ్రీజ కొణిదెల(Sreeja Konidela).. ఇండస్ట్రీ లోకి రాకపోయినా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చిన్న కూతురుగా ఒకింత పేరు తెచ్చుకున్న ఈమె.. తన వ్యక్తిగత విషయాల వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా భరద్వాజ్ (Bhardwaj)అనే వ్యక్తిని ప్రేమించిన ఈమె.. ఇంట్లో కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ అతనితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అంతేకాదు కుటుంబ సభ్యుల నుండి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇక తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భరద్వాజ్ అసలు రూపాన్ని తెలుసుకున్న శ్రీజ అతడికి విడాకులు ఇచ్చి, బిడ్డను తీసుకొని తండ్రి చెంతకు చేరుకుంది. ఎంతైనా కన్న బంధం కాబట్టి ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకున్నారు చిరంజీవి. అందులో భాగంగానే ఆమెను ఆదరించి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు ఇక తర్వాత కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి శ్రీజాకు రెండవ వివాహం జరిపించారు. వీరి బంధానికి గుర్తుగా మరో పాప పుట్టింది. అయితే ఇప్పుడు కళ్యాణ్ దేవ్ తో కూడా ఈమె కలిసి ఉండడం లేదు. కళ్యాణ్ దేవ్ కి కూడా విడాకులు ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అటు కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతుర్ని వారానికి ఒకసారి కలుస్తూ పాపతో గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు.
మా అమ్మకు నాగబాబు అంటేనే ఇష్టం -చిరంజీవి
ఇదిలా ఉండగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి.. తన తమ్ముడు నాగబాబు(Nagababu), తన తల్లి అంజనమ్మ(Anjanamma ), సోదరీమణులతో కలిసి ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి తన తల్లి అంజనమ్మ గురించి అలాగే తన చిన్న కూతురు శ్రీజ గురించి చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు. వారి కష్టాలు తెలిపి అందరికీ కంటతడి తెప్పించారు. చిరంజీవి మాట్లాడుతూ..” మా అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం. ముఖ్యంగా మా ఐదుగురిలో నాగబాబుకి అమ్మ మొదటి ప్రయారిటీ ఇస్తుంది. నాగబాబుని ఇప్పటికీ కూడా దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెడుతుంది” అంటూ తెలిపారు.
also read; Chiranjeevi: పుట్టుకతోనే అన్నయ్య కష్టజీవి- నాగబాబు..!
శ్రీజ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది -చిరంజీవి
ఇక అలాగే తన చిన్న కూతురు శ్రీజ విడాకుల గురించి మాట్లాడుతూ.. “శ్రీజ విడాకుల తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది రెండుసార్లు విడాకులు అవడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మా అమ్మే. శ్రీజా తన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా.. ముందుగా తన నానమ్మ సలహాలు తీసుకుంటుంది. అలా నా తల్లి అంజనమ్మ సలహాలు తీసుకొని ఇప్పుడు శ్రీజ ముందుకు వెళ్తోంది. ఇక విడాకుల గురించి నా తల్లి అంజనమ్మ దగ్గర శ్రీజ ఈ విషయం చెప్పిన సమయంలో.. ఎవడో ఒకడి గురించి నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోకూడదు. నువ్వు ఖచ్చితంగా ముందుకు వెళ్లాలి అంటూ శ్రీజలో ధైర్యాన్ని నింపింది. అందుకే ఇప్పుడు ఏ విషయమైనా సరే శ్రీజ ముందుగా తన నానమ్మతోనే చర్చిస్తుంది. చిన్నప్పటినుండి కూడా మా అమ్మ మాలో కూడా ఎంతో ధైర్యాన్ని నింపింది” అంటూ చిరంజీవి తెలిపారు మొత్తానికైతే చిరంజీవి తన రెండవ కూతురు రెండవసారి కూడా విడాకులు తీసుకుందని క్లారిటీ ఇస్తూనే తన కూతురు పడ్డ కష్టాన్ని చెప్పి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి