BigTV English

Sridhar Babu : ఓడినా వ్యవహార శైలి మారలే.. బీఆర్ఎస్ నేతలపై శ్రీధర్ బాబు ఫైర్..

Sridhar Babu : ఓటమి పాలైనప్పటికీ బీఆర్ఎస్ నేతల వైఖరిలో మార్పు రాలేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. గాంధీ భవన్‌లో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా తీర్పు ఇచ్చారన్నారు. డిసెంబరు 7వ తేదీన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే రెండు హామీలు అమలు చేశామని శ్రీధర్ బాబు అన్నారు.

Sridhar Babu : ఓడినా వ్యవహార శైలి మారలే.. బీఆర్ఎస్ నేతలపై శ్రీధర్ బాబు ఫైర్..

Sridhar Babu : ఓటమి పాలైనప్పటికీ బీఆర్ఎస్ నేతల వైఖరిలో మార్పు రాలేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. గాంధీ భవన్‌లో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా తీర్పు ఇచ్చారన్నారు. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే రెండు హామీలు అమలు చేశామని శ్రీధర్ బాబు అన్నారు.


కేసీఆర్‌ రెండోసారి గెలిచినప్పుడు రెండు నెలల వరకు కనీసం మంత్రులు కూడా లేరని శ్రీధర్ బాబు విమర్శించారు. మంత్రులు లేకుండా రెండు నెలలపాటు పాలించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3,500 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిందన్నారు. ప్రజలను అవమానిస్తూ కేసీఆర్‌ పాలన సాగించారని శ్రీధర్ బాబు ఆరోపించారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఇప్పటికే 6.50 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయని శ్రీధర్ బాబు తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు. నవ్విపోదురుగాక.. నాకేంటి అన్నట్టుగా బీఆర్ఎస్ నేతల వైఖరి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 20 రోజులకే కేటీఆర్‌ అక్కసు వెళ్లగక్కుతున్నారని అని శ్రీధర్‌బాబు విమర్శించారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×