E-Paper
Advertisement

ఆంధ్రా మద్యం తెలంగాణలోకి ఎలా వచ్చింది: శ్రీనివాస్ గౌడ్

ఆంధ్రా మద్యం తెలంగాణలోకి ఎలా వచ్చింది: శ్రీనివాస్ గౌడ్
Advertisement

Liquor Smuggling: స్వేచ్ఛ బ్యూరో: ఆంద్రా మద్యం తెలంగాణ లోకి ఎలా వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. ఎక్సయిజ్ శాఖ మంత్రి దగ్గర ఓ ఎస్ డీ గా ఉన్న రిటైర్డ్ అధికారి అవినీతి కి అంతే లేదని ఆరోపించారు. కూకట్ పల్లిలో ఓ వైన్ షాప్ లో ఆంధ్రా మద్యం దొరికింది. ఆ మద్యాన్ని పట్టుకుని కొంత ఫైన్ వేసి లక్షల్లో లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ లంచం నేరుగా మంత్రి ఓ ఎస్ డీ కే వెళ్ళింది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఈ అవినీతి ఇట్లా ఉంటె ఆంధ్రా అధికారుల పెత్తనం మరో వైపు తెలంగాణ ఉద్యోగుల పట్ల శాపం లా మారుతోందన్నారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల ఆంధ్రా అధికారుల వైఖరి మారక పోతే మరో ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.

ఆంధ్రాకు కీలక పోస్టింగ్‌లు..

తెలంగాణ లో నీళ్లు ,నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతోందన్నారు. ఆంధ్రా నుంచి వచ్చి రావడం తోనే ఓ అధికారికి ఎక్సయిజ్ శాఖ కమిషనర్ పదవి ఇచ్చారన్నారు. ఆంధ్రా అధికారులకు కీలక పోస్టింగ్ లు ఇచ్చి తెలంగాణ అధికారులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆంధ్రా అధికారి తీరు వల్ల తెలంగాణ అధికారుల ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు గుండె పోట్లు వస్తున్నాయని, బీసీ ,ఎస్సీ ,ఎస్టీలను కులం పేరుతో ఆ అధికారి దూషిస్తున్నాడన్నారు. సోమిరెడ్డి అనే సిన్సియర్ అధికారి ఆ ఆంద్రా అధికారి తిట్లకు కుప్ప కూలిపోయాడని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు.

Advertisement

Also Read: డైటింగ్ చేస్తున్నా.. బరువు తగ్గకపోవడానికి గల అసలు కారణాలు ఇవే!

ఆవేదన వ్యక్తం..

తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం ఏమిటని నిలదీశారు. ఆంధ్రా అధికారి బూతులతో ఇక తాను ఉద్యోగం చేయనని సోమిరెడ్డి ఆత్మగౌరవం ప్రదర్శించారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తీస్తున్న ఆంధ్రా అధికారులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఉద్యోగులను వేధించిన ఎక్సయిజ్ కమిషనర్ హరి కిరణ్ ను తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఏసీబీ తిమింగలాలను వదిలేసి చిరు ఉద్యోగుల మీద పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని, సోమిరెడ్డి కి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే భాద్యత అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ ,వాల్య నాయక్ ,రామచంద్ర నాయక్ ,సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

Also read:ఈ కేసుతో నాకు సంబంధం లేదు… మంగ్లీ వివాదంపై డైరెక్టర్ క్లారిటీ!

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×