D-Mart: చాక్లెట్ చోరీ చేశాడని 13 ఏళ్ల బాలుడిని ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్ యాజమాన్యం చిత్రహింసలు పెట్టారు. వస్తువులు కొనడానికి వచ్చిన ఆ బాలుడిని చోరీ చేశాడని.. బిల్డింగ్ అండర్ గ్రౌండ్‌లో నిర్బంధించారట.
ఐదు గంటల పాటు క్రూరత్వాన్ని ప్రదర్శించారని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. పైపులతో శరీరంపై వాతలు పడేలా కొట్టారట. తమ కొడుకుతో ఉప్పు, కారం తిని పిచ్చి పైశాచికానందం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పోలీసులకు జరిగిన విషయం చెప్పినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని విడిపించారు. బాలుడిని హింసించినందుకు మెగా డీమార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.