Good Bad Ugly : కోలీవుడ్ టైర్ 1 హీరోల్లో అజిత్ ఒకడు. ఆయన నుంచి సినిమా వస్తుందటే చాలు… తమిళనాడులో ఎక్కడ లేని హడావుడి కనిపిస్తుంది. ఈ కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు ఇక్కడ కూడా రిలీజై హిట్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ టైంలో.. హీరోపై నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…
గుడ్ బ్యాడ్ అగ్లీ… ఈ మూవీ నిజానికి సంక్రాంతి బరిలో ఉండాల్సింది. సంక్రాంతికి రిలీజ్ చేయడానికి అన్ని విధాలుగా మూవీ యూనిట్ రెడీ అయింది. అయితే, కొన్ని కారణాల వల్ల గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నారు. అంతే కాదు.. యూఎస్ ప్రిమియర్స్ ఒక రోజు ముందుగానే… అంటే ఏప్రిల్ 09నే ఉంటాయని ఇప్పటికే పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు.
అంటే… మూవీ థియేటర్స్ లోకి రావడానికి ఇంకా కేవలం 7 రోజుల టైం మాత్రమే ఉంది. కానీ, ప్రమోషన్స్ హడావుడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో నిర్మాతలు కాస్త తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
నిజానికి అజిత్ కుమార్ తన సినిమాలకు ప్రమోషన్స్ లో పాల్గొనడు. ఈ కానీ, ఈ నిర్మాతలు మాత్రం… తమ సినిమాలకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తారు. అవసరమైతే… ప్రమోషన్స్ కు సపరేట్ గా బడ్జెట్ కూడా కేటాయిస్తారు. అలా ఉంటుంది ఆ నిర్మాతలతో.. ఇప్పటి వరకు ఈ నిర్మాతల సినిమాలకు అలానే చేశారు.
కానీ, ఇప్పుడు ఈ హీరో సినిమా షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసి, ప్రమోషన్స్ అంటే అంటీముట్టనట్టుగా ఉండడం వల్ల నిర్మాతలు ఇబ్బందిలా ఫీల్ అవుతున్నారట. రిలీజ్ కి మరో 7 రోజులు మాత్రమే ఉంది. ఈ టైంలో సినిమాపై ఉన్న బజ్ చూస్తే మరీ దారణం. ఇలాంటి టైంలో హీరోతో రెండు ప్రెస్ మీట్స్, రెండు ఈవెంట్స్ మరో రెండు, మూడు ఇంటర్వ్యూస్ ఉంటే బాగుండని నిర్మాతలు ఫీల్ అవుతున్నారట. కానీ, హీరో మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. ఎప్పటిలానే… ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నాడు.
హీరో నిర్ణయం వల్ల నిర్మాతలు తలలు పట్టుకుని, ఏం చేయాలని పరిస్థితిలో ఉన్నారట. ప్రమోషన్స్ కు హీరో వచ్చేలా లేడు. సినిమాకు బజ్ చాలా తక్కువగా ఉంది. ఇలాంటి బజ్‌తో సినిమా రిలీజ్ అయితే.. పెట్టిన డబ్బులు వస్తాయా..? అని అనుకుంటున్నారట. కాగా, ఈ సినిమా నిర్మాణానికి నిర్మాతలు దాదాపు 200 కోట్లు పెట్టినట్టు తెలుస్తుంది.