Supreme Court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణను మరోమారు వాయిదా పడింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సోమవారం ఉదయం జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు అనర్హత పిటిషన్‌పై వాదోప వాదనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు.
స్పీకర్ నుంచి మరింత సమాచారం కోసం సమయం కోరారు అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాది. స్పీకర్‌తో చర్చించి వివరాలు అందజేస్తామన్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని, ఇప్పటికే 10 నెలలు పూర్తి అయ్యిందని, ఇంకెంత గడువు కావాలని ప్రశ్నించింది ధర్మాసనం. చివరకు ముకుల్ విజ్ఞప్తితో పిటిషన్ పై విచారణను ఫిబ్రవరి 18కివాయిదా వేసింది న్యాయస్థానం.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మల్యేలపై అనర్హత వేటు వేసేందుకు జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేటీఆర్ తన పిటిషన్‌లో తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్‌లను ప్రతివాదులుగా చేర్చిన విషయం తెల్సిందే.
ఇప్పుడు కాకపోయినా రేపటి రోజైనా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని కొండంత ఆశలు పెట్టుకుంది బీఆర్ఎస్. గతంలో ఇలాంటి కేసుల్లో తీర్పులు తెలంగాణకు వర్తిస్తాయన్నది బీఆర్ఎస్ మాట. ఈ నేపథ్యంలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఖాయమన్నది భావిస్తోంది.
ALSO READ: బీఆర్ఎస్‌పై ఆగ్రహం.. డీల్ కుదిరిందన్న టీపీసీసీ చీఫ్
పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే వివరణ ఇచ్చేందుకు తమకు 40 రోజుల గడువు కావాలని స్పీకర్‌కు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ తరపు న్యాయవాదులతోపాటు సొంతంగా అడ్వకేట్లను పెట్టుకున్నారు. మరోవైపు ఉప ఎన్నికకు తామే సిద్ధమేనంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం వరంగల్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
BREAKING
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా
ఇకపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు చెల్లవు.. నామినేషన్ ఒకే వ్యక్తి వేసినా నోటా మీద ఎన్నికలు జరపాల్సిందే అంటూ వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు
కేటీఆర్, కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 18కి వాయిదా https://t.co/51GWrgVfmd
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2025