BigTV English

Jr NTR : బ్రిటీష్ సింగర్ నోట ఎన్టీఆర్ రొమాంటిక్ సాంగ్… ఎంత క్యూట్‌గా ఉందో మీరే వినండి !

Jr NTR : బ్రిటీష్ సింగర్ నోట ఎన్టీఆర్ రొమాంటిక్ సాంగ్… ఎంత క్యూట్‌గా ఉందో మీరే వినండి !

Jr NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), జాన్వి కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన ‘దేవర’ (Devara) మూవీ గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసినప్పటి నుంచి ‘చుట్టమల్లె’ (Chuttamalle Song) పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఇండియాలోనే కాదు గ్లోబల్ గా కూడా ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది అనే విధంగా పాపులర్ బ్రిటిష్ సింగర్ (Ed Sheeran) నోట ‘చుట్టమల్లె’ సాంగ్ వినిపించడంతో, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


‘చుట్టమల్లె’ సాంగ్ పాడిన ఎడ్  

‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటను తాజాగా శిల్పారావుతో కలిసి ఎడ్ షీరన్ పాడారు. ఆదివారం రోజు బెంగళూరులో జరిగిన కాన్సర్ట్ లో ఎడ్ షీరన్ స్వీట్ గా, క్యూట్ గా “ఎందుకు పుట్టిందో పుట్టింది” అంటూ తెలుగులో ఈ పాటను పాడడం చూస్తుంటే ముచ్చటగా అన్పిస్తోంది. ఈ జంట ఒరిజినల్ వెర్షన్ పాడుతుంటే, మరోవైపు ఆడిటోరియం సైతం దద్దరిల్లింది. ఈ సాంగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండే ‘ఆ’ అనే సౌండ్ ని ఇస్తూ, ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్. ఇండియన్ మ్యూజిక్ ను గౌరవిస్తూ ఆయన ఈ పాటను నేర్చుకొని, స్టేజ్ పై పాడడం మూవీ లవర్స్ ను ఫిదా చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ గా మారింది.


ఎడ్ పర్ఫామెన్స్ కు అడ్డుకట్ట…

ఎడ్ షీరన్ బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ లో సర్ప్రైజ్ పర్ఫామెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. కాన్సర్ట్ కంటే ముందు ఈ స్ట్రీట్ పర్ఫామెన్స్ ను ఇవ్వడానికి ఆయన రెడీ కాగా, బెంగళూరు పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అనుమతులు లేవన్న కారణంతో షోను ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆయన ముందుగానే దీనికి సంబంధించి అనుమతి తీసుకున్నట్టు ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

కాగా ఎడ్ గత కొంతకాలంగా ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన హైదరాబాద్ తో పాటు చెన్నైలోనూ కాన్సర్ట్ లు నిర్వహించారు. ఎడ్ కు ఇండియాలో భారీ సంఖ్యలో అభిమానులు ఉండడంతో ఆయన ఈవెంట్ ఎక్కడ జరిగినా సరే భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతున్నారు. ఏఆర్ రెహమాన్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సైతం చెన్నైలో జరిగిన ఎడ్ ఈవెంట్ కి హాజరు కావడంతో మరింత క్రేజ్ పెరిగింది. నెక్స్ట్ ఎడ్ షిల్లాంగ్ తో పాటు ఢిల్లీలోను పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు.

ఎన్టీఆర్ రియాక్షన్ 

ఎడ్ ‘చుట్టమల్లె’ పాటను పాడడంపై జూనియర్ ఎన్టీఆర్  స్పందించారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్ లో కాన్సర్ట్ వీడియోను పోస్ట్ చేస్తూ “సంగీతానికి సరిహద్దులు లేవు. మీరు దానిని మళ్ళీ నిరూపించారు, ఎడ్! మీరు తెలుగులో చుట్టమల్లె పాడటం వినడం నిజంగా ప్రత్యేకమైనది” అని రాసుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ చేసిన ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×