E-Paper
Advertisement

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!
Advertisement

Tank Bund Accident: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన రోజే, ఆరేళ్ల చిన్నారికి ఆఖరి రోజవుతుందని ఆ కుటుంబం కలనైనా ఊహించలేదు. పుట్టినరోజు ఆనందం కాస్తా కన్నీటి సముద్రంగా మారిన ఈ ఘోర ప్రమాదం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ట్యాంక్‌‌బండ్‌పై చోటుచేసుకుంది.

సినిమా చూసి.. కేక్ కట్ చేద్దామని..

Advertisement

అల్వాల్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారి సరాక్షి పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో ఉత్సాహంగా వేడుకలు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే మొదట కూకట్‌పల్లిలోని పీవీఆర్ మాల్‌లో సినిమా చూశారు. అనంతరం కేక్ కట్ చేసి హ్యాపీగా గడుపుదామని ట్యాంక్‌బండ్ వచ్చారు. మగ్ధూమ్ మోహియుద్దీన్ విగ్రహం సమీపంలో తమ కారును నిలిపి, హుస్సేన్‌సాగర్ వైపు రోడ్డు దాటుతుండగా ఈ ఘోరం జరిగిపోయింది.

వేగంగా వచ్చిన లారీ..

Advertisement

కుటుంబమంతా రోడ్డు దాటుతుండగా సికింద్రాబాద్ వైపు నుంచి తీవ్ర వేగంతో వచ్చిన ఒక లారీ వారిపైకి దూసుకొచ్చింది. ఆ లారీ చిన్నారి సరాక్షితో పాటు ఆమె బంధువు విశ్వనాథ్ (41)ను బలంగా ఢీకొట్టింది. లారీ ధాటికి తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల చిన్నారి సరాక్షి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

గాంధీ ఆస్పత్రిలో మరొకరి మృతి

ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో పడివున్న విశ్వనాథ్‌ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కూడా చికిత్స పొందుతూ కన్నుమూశారు. వేడుకల కోసం వచ్చి కంటిముందే ఇద్దరిని కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌పై చర్యలకు దిగారు.

Also Read: అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

Tags

Related News

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

Big Stories

Advertisement
×