E-Paper
Advertisement

బుధవారం జీఎస్టీ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్, అదే జరిగితే బంగారం-వెండి ధరలకు రెక్కలు

బుధవారం జీఎస్టీ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్, అదే జరిగితే బంగారం-వెండి ధరలకు రెక్కలు
Advertisement

Gold: బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులకు సంబంధించి త్వరలో కీలక మార్పులు రానున్నాయి. బుధవారం అనగా అక్టోబర్ 7న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రం.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తంది. ఈ సమావేశంలో బ్యాంకులు, ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన నామినేటెడ్ ఏజెన్సీలు విలువైన లోహాల దిగుమతులపై ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ-IGST మినహాయింపు పూర్తిగా ఉపసంహరించుకునే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు సమాచారం. అదే జరిగితే బంగారం వెండి, ప్లాటినమ్ ధరలు పెరగనున్నాయి.

బుధవారం జీఎస్సీ సమావేశం

దేశంలోకి ఎవరైనా వ్యాపారులు.. బంగారం, వెండి, ప్లాటినం లోహాలు, వస్తువులు దిగుమతి చేసుకుంటే 3 శాతం ఐజీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలకు ఈ పన్ను నుంచి ప్రత్యేక మినహాయింపు లభిస్తోంది కేంద్రం. దేశంలో జీఎస్టీ విధంగా అమల్లోకి వచ్చిన 2017 నుంచి వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి వ్యాపార కార్యకలాపాలు ఆటంకాలు లేకుండా సాగడానికి ఈ ప్రత్యేక వెసులుబాటును కల్పించింది. పన్ను మినహాయింపు ఎందుకు రద్దు చేయాలని భావిస్తోంది కేంద్రం. కొన్నేళ్లుగా పన్ను మినహాయింపు నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఐజీఎస్టీ మినహాయింపు రద్దు చేస్తే బులియన్ ఎక్స్ఛేంజీలు, బ్యాంకులు లేదా ఏజెన్సీలు పన్నుల చెల్లింపు విషయంలో ఓ దారికి వస్తాయి. దీనివల్ల అందరికీ ఒకే రకమైన పన్ను విధానం వర్తిస్తుందని అధికారులు అంచనా.

బంగారం, వెండి దిగుమతులపై ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ మినహాయింపు?

Advertisement

బంగారం, వెండి దిగుమతులు కేంద్రానికి పెద్ద సవాల్‌గా మారింది. దీని కారణంగా విదేశాల నుంచి వాటిని కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున విదేశీ కరెన్సీ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా విదేశీ మారక నిల్వలపై తీవ్రమైన భారం పడుతోంది. ఆభరణాల తయారీ పరిశ్రమలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఏటా భారీ దిగుమతులు చేసుకుంటోంది భారత్. ఈ దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి అనవసరమైన కొనుగోళ్లను తగ్గించడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకుంది కేంద్రం. మే నెలలో బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచింది.

అదే జరిగితే బంగారం-వెండి ధరలు పెరిగే ఛాన్స్

బంగారం, వెండిపై 6 శాతం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. ప్లాటినంపై 6.4 శాతం సుంకాన్ని 15.4 శాతానికి పెంచింది. మినహాయింపు తొలగించి పన్ను వేస్తే, బంగారం, వెండి, ప్లాటినమ్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. దానివల్ల బంగారం దిగుమతులను మరింత కట్టడి చేయవచ్చని ఆ శాఖ అధికారుల అంచనా. తాజాగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే.. 2026-27 ఏప్రిల్ నుండి ఆగస్టు నెలల మధ్య దేశంలో బంగారం దిగుమతులు 3.38 శాతం మేరా పెరిగాయి. వీటి విలువ సుమారు 17.47 బిలియన్ డాలర్లు. అదే సమయంలో వెండి దిగుమతులు కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి దిగుమతులు 8.81 శాతం క్షీణించి వాటి విలువ 1.74 బిలియన్ డాలర్లకు చేరింది.

Advertisement

ALSO READ: రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.7.5 లక్షల ఆదాయం.. తెలుగోడి స్పెషల్ ఇడ్లీ బిజినెస్

Related News

రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.7.5 లక్షల ఆదాయం.. తెలుగోడి స్పెషల్ ఇడ్లీ బిజినెస్

ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? బిల్డర్లు ఈ విషయాల్లో మోసం చేస్తారు.. జాగ్రత్త

రూ.1 లక్ష జీతం వచ్చినా సరిపోవడం లేదు? యువ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్

రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

బ్యాంక్‌లో సీనియర్ జాబ్ వదిలి మైక్రోగ్రీన్స్ బిజినెస్.. చిన్నగదిలో నుంచే రూ.5 లక్షలు ఆదాయం

పోస్ట్ ఆఫీస్ MISలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చా? డిపాజిట్ లిమిట్స్ ఇవే

8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం

Big Stories

Advertisement
×