E-Paper
Advertisement

అవార్డులు ప్రతిభకా.. లేక పరిచయాలకా.. ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో దారుణం!

అవార్డులు ప్రతిభకా.. లేక పరిచయాలకా.. ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో దారుణం!
Advertisement

Teacher Awards: స్వేచ్ఛ బ్యూరో: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న జరుపుకుంటారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి జిల్లా స్థాయిలో విమర్శలకు తావు లేకుండా జరగగా, మండల స్థాయిలో జరిగిన ప్రక్రియ లోపాలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిబద్ధతతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించాల్సిన అవార్డుల ఎంపికలో సమగ్ర ప్రమాణాలు పారదర్శకత పనితీరుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందని ఉపాధ్యాయ వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. ఉత్తమ ఉపాధ్యాయుడు ఎంపిక కేవలం సిఫారసు, పరిచయం , ఇతర ప్రభావాలతో నిర్ణయించే అంశం కాదని ఏడాది పాటు విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడి చేసిన కృషిని సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

అభ్యసన సామర్థ్యం..

ఉపాధ్యాయ సంఘాలు తమ సభ్యుల సమస్యల పరిష్కారానికి పనిచేయడం సహజమైనప్పటికీ ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో సంఘాల ప్రాతినిధ్యం ప్రభావం ప్రామానంగా మారకూడదని పలువురు కోరుతున్నారు. ఏ సంఘానికి చెందినవారు అన్నదానికంటే తరగతి గదిలో వారి పనితీరు విద్యార్థుల అభ్యసనను సామర్థ్యం పాఠశాల అభివృద్ధికి చేసిన కృషిని ప్రామాణికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత వనరులతో పనిచేస్తూ విద్యార్థుల హాజరును పెంచడం చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయడం, తల్లిదండ్రులతో సమన్వయం చేయడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే అలా మౌనంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి కంటే సిఫారసులు, పరిచయాలు ఇతర ప్రభావాలకు ప్రాధాన్యం లభిస్తే నిజమైన ప్రతిభకు అన్యాయం జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి.

హాజరు శాతం బోధన పద్ధతులు..

Advertisement

విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం ఉత్తమ ఉపాధ్యాయుడి పనితీరుకు నిదర్శనంగా ఉండాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వెనుకబడిన విద్యార్థులను ఎంతవరకు ముందుకు తీసుకువచ్చారు. విద్యార్థుల హాజరుని ఎలా పెంచారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ఎలా పెంపొందించారు అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.విద్యార్థుల ప్రవేశాలు, ఉత్తమ ఫలితాలు, వినూత్న బోధన విధానాలు, పాఠశాల అభివృద్ధి మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏళ్ల తరబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించేందుకు ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించాల్సిన అవసరం ఎంతవరకు ఉందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు విద్యార్థుల ప్రగతి హాజరు శాతం బోధన పద్ధతులు పాఠశాల అభివృద్ధికి చేసిన కృషి సమాజంలో విద్యాపరంగా అందించిన సేవలకు సంబంధించిన వివరాలు విద్యా శాఖ వద్ద అందుబాటులో ఉంటే వాటి ఆధారంగా అర్హులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అనుభవానికి పెద్ద పీట వేయాలన్నారు.

Also read: 2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

అనుభవానికి ప్రాధాన్యత ఏది

Advertisement

మల్దకల్ మండలంలో పనిచేస్తున్న ఎస్ జి టి మురళీధర్ రెడ్డి విషయంలోనూ అన్యాయం జరిగిందని, చర్లగార్లపాడు పాఠశాలలో విధులు నిర్వహిస్తూ, అనేక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు టెక్స్ట్‌బుక్ రైటర్‌గా పనిచేశారని, ఎన్ సి ఈ ఆర్ టి నిర్వహించిన వర్క్‌షాప్‌లలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రస్థాయి గణిత పరిశోధనా సెమినార్లలో రెండుసార్లు అవార్డులు పొందారని, రాష్ట్ర, జిల్లా స్థాయి రిసోర్స్‌పర్సన్‌గా అనేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారన్న గుర్తింపు సమాజంలో ఉంది. గతేడాది నిర్వహించిన విదేశీ ఎక్స్‌పోజర్ టూర్‌కు స్వల్ప తేడాతో అవకాశం కోల్పోయిన మురళీధర్ రెడ్డిని కాకుండా, ప్రొఫైల్ కూడా సమర్పించని వ్యక్తిని ఎంపిక చేయడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రతి మండలానికి నలుగురు..

ఎంఈఓ లు ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో మండలంలోని ఎస్జీటీల అనుభవం, పనితీరు ఇతరత్రా ప్రత్యేక కార్యక్రమాలు, ట్రైనింగ్ తదితర వాటిలో నిష్ణాతులైన వారిని ఎంపిక చేయడంలో కీలకపాత్ర వహిస్తారు. అందులో భాగంగా ప్రతి మండలానికి నలుగురి ఉపాధ్యాయులను ఎంపిక చేయగా అందుకు అనుగుణంగా 50 మార్కులకు గాను మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మల్దకల్ మండల ఎంఈఓ ముందు చూపుతో అందరిని సమాధానపరిచేందుకు సమాన మార్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.అందులో అనుభవం ఇతరత్రా యాక్టివిటీస్ లో ముందంజలో ఉన్న మురళీధర్ రెడ్డికి ప్రాధాన్యత మార్కులు వేయాల్సింది. అందుకు భిన్నంగా సమానంగా మార్కులు ఇవ్వడంతో ఎంపికలో క్లిష్టత ఏర్పడింది.దీన్ని సెలక్షన్ కమిటీ కలెక్టర్ ముందు పెట్టడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, పనితీరు ఆధారంగా ఎంపిక చేయడంతో మురళీధర్ రెడ్డి ఎంపిక నామమాత్రం అయింది. మిగతా మండలాలలో 50కు ఒకటి,రెండు ,మూడు మార్కులు అటూ ఇటూ వేయగా కేవలం మల్దకల్ ఎంఈఓమాత్రమే ఇలా వేయడంలో అంతర్యం ఏమిటి అని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

గద్వాలకు మొండి చేయి

గద్వాల మండలం, గద్వాల పట్టణం కలిపి ఉన్న కేడర్ స్ట్రెంత్ దాదాపు మూడు మండలాలకు సమానంగా ఉన్నప్పటికీ, కేవలం ఒక మండలంగా పరిగణించడం వల్ల గద్వాల పట్టణంలోని ఒక్క ఎస్ జి టికి కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కలేదని, పట్టణం, రూరల్ ప్రాంతాలను ప్రత్యేకంగా పరిగణించి న్యాయబద్ధంగా అవార్డులు కేటాయించాల్సిందని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో లీకులు

ఉపాధ్యాయుడికి జరిగిన అన్యాయంపై ఉపాధ్యాయ సంఘాలు సోషల్ మీడియాలో పోస్టులో సైతం పెడుతూ ఈ సమస్యకు డీఈఓ నే కారణమని విమర్శిస్తున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఎంఈఓ చేసిన తప్పిదమే ఈ సమస్యకు కారణమని విశ్రాంత ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయునికి జరిగిన అన్యాయంపై ఉద్యోగ సంఘాలు సంబంధిత అధికారికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Aklso read: 1980s ఫోటో ట్రెండ్ వెనుక పెద్ద స్కామ్.. సైబర్ క్రైమ్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్!

Tags

Related News

మగవాళ్లే చీర కట్టుకుని అలాంటి దందాలు.. అదిలాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆవేదన!

మేడ్చల్‌ స్వరూప నర్సింగ్ హోమ్‌లో షాకింగ్ సీన్.. కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి..?

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

జీహెచ్ఎంసీలో ష్.. గప్ ‌చుప్ రూల్.. ఉన్నతాధికారుల సీక్రెట్ ఆంక్షలు!

ఇల్లు లేదా కొత్త ప్లాట్ కొంటున్నారా.. అయితే హైడ్రా మీకు గుడ్ న్యూస్!

1980s ఫోటో ట్రెండ్ వెనుక పెద్ద స్కామ్.. సైబర్ క్రైమ్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్!

నాడు ఎన్నికల్లో.. నేడు పరిపాలనలో.. రేవంత్ మైండ్ గేమ్‌లో ఇరుక్కున్న బీఆర్ఎస్!

Big Stories

Advertisement
×