GHMC: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అత్యధిక జనాభాకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలోని కొందరు ఉన్నతాధికారులు వివిధ విభాగాధిపతులకు అర్థరహితమైన నిబంధనలు విధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిబధ్దతతో విధులు నిర్వర్తించాల్సిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తాము ఏం చేసినా బయటకు లీక్ కావద్దన్న ధోరణితో పని చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ది, పౌర సేవల నిర్వహణతో పాటు అభివృద్ది, మెయింటనెన్స్ కు సంబంధించిన ఎలాంటి వివరాలను కూడా విభాగాధిపతులు ఎలాంటి సమాచారాన్ని బయట పెట్టొద్దని అధికారికంగా నిబంధన విధించినట్లు సమాచారం.
ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన రెండున్నరేళ్ల కాలంలో చేయని పనులకు క్లెయిమ్ చేసిన బిల్లులను చెల్లించటం, ఇటీవల కోర్ అర్బన్ రిజియన్ మూడు కార్పొరేషన్లుగా ఏర్పడిన తర్వాత మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఈఆర్ పీ రీ మ్యాపింగ్ సమయంలో ఒకే పనికి రెండు బిల్లులు చెల్లించటంతో పాటు నాలా పూడికతత పనుల్లో అక్రమాలు చోటుచేసుకోవటంతో పాటు వరుసగా పలు అవకతవకలపై సిటీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే తప్పా, నాలా పూడికతీత పనుల్లో అక్రమాలు వెలుగులోకి రాలేదు. దీనికి తోడు రాజేంద్రనగర్ జోన్ లో గణేష్ నిమజ్జన పనులకు సంబంధించి కూడా టెండర్లలో గోల్ మాల్ జరిగిన వ్యవహారం కూడా వెలులోకి వచ్చిన సంగతి తెల్సిందే.
వాటిపై విజిలెన్స్ విచారణను చేయించిన ఉన్నతాధికారులు కమిషనర్ నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదన్న విషయం కూడా బయట చర్చనీయాంశంగా మారటంతో ఉన్నతాధికారులు విభాగాధిపతులకు నిబంధనలను విధించినట్లు తెలిసింది. ముఖ్యంగా గడిచిన రెండున్నరేళ్ల క్రితం నుంచి కోర్టు ధిక్కారణకు సంబంధించి కమిషనర్ కు వరుసగా సమన్లు మంజూరు కావటం, ఈ వ్యవధిలోనే సుమారు 80 పై చిలుకు వ్యవహారాలకు సంబంధించి విజిలెన్స్ విచారణలు జరిగినా, ఇప్పటి వరకు ఏ ఒక్క బాధ్యుడిపై చర్యలు తీసుకున్న సందర్భాల్లేవు.
Also read: కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. వీడియో వైరల్!
జీహెచ్ఎంసీలోని ట్రాన్స్ పోర్టు విభాగంలో అక్రమాలపై విచారణను చేపట్టిన విజిలెన్స్ అక్రమాలు జరిగిన విషయాన్ని నిర్థారిస్తూ, అందుకు అయిదుగురు ఉద్యోగులు కారణమన్న విషయాన్ని స్పష్టం చేస్తూ నివేదికలను సమర్పించినా, వారిపై చర్యలు తీసుకోకపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం బయట చర్చనీయాంశంగా మారినందుకే జీహెచ్ఎంసీకి సంబంధించి ఈ విభాగం నుంచి ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా అధికారులంతా ష్.. గప్ చుప్ గా పని చేసుకోవాలని ఉన్నతాధికారులు విభాగాధిపతులకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది. ఎవరైనా ఎలాంటి సమాచారం అడిగినా తమ వద్ద లేదని, కమిషనర్ ను సంప్రదించాలని కొన్ని విభాగాలకు చెందిన హెచ్ఓడీలు చెప్పటం గమనార్హం. మరి కొందరు విభాగాధిపతులు సాధారణ, సందర్శకులతో పాటు స్వచ్ఛంధ సంస్థలకు చెందిన ప్రతినిధులు కలిసేందుకు వచ్చినా, వారిని కలిసేందుకు గజగజలాడుతున్నట్లు సమాచారం.
తాము ఏమీ మాట్లాడినా, దాని ఎఫెక్టు ఎలా ఉంటుందోనని మాట్లాడేందుకు కూడా విభాగాధిపతులు బయపడుతున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో అంతర్గతంగా జరుగుతున్న పలు అక్రమాలు బయటకు రావటంతో ఇప్పటికే కొందరు విభాగాధిపతులకు కమిషనర్ చురకలు కూడా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని సుమారు కోటిన్నర మంది జనాభా జీవితాలతో ముడిపడిన విధులు నిర్వహిస్తున్న స్థానిక సంస్థలు నిర్వహిస్తున్న విధులు, కొత్తగా తీసుకువస్తున్న సంస్కరణలను బయటకు వెల్లడించకుంటే ప్రజలు చెల్లిస్తున్న వివిధ రకాల పన్నులతో పని చేసే స్థానిక సంస్థల పనితీరుపై ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఏం జరుగుతుంది. విభాగాలు ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తున్నాయో తెల్సుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం కింద వస్తున్న పిటిషన్లు కూడా మూలనపడుతున్నట్లు సమాచారం. ఇవ్వాల్సిన సమాచారం లభ్యం కావటం లేదని, ఒక పిటిషనర్లకు సమాచారమిచ్చినా, అసంపూర్తిగానే ఇస్తున్నట్లు సమాచారం. మరి కొన్ని విభాగాల్లో సమాచార హక్కు పిటిషన్లకు సమాధానమిచ్చేందుకు సిబ్బంది లేదని సాకులు చెబుతూ కాలయాపన చేస్తూ, పిటిషన్లను మూలనపడేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also read: 1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!