E-Paper
Advertisement

Road Expansion: పాతబస్తీలో రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్!

Road Expansion: పాతబస్తీలో రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్!
Advertisement

Road Expansion: స్వేచ్ఛ బ్యూరో: ఇరుకు రోడ్లతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ సతమతమవుతున్న పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని చార్మినార్ జోన్‌లో ఆరు ప్రధాన రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది.పచ్చజెండా ఊపింది.

ఉత్తర్వుల్లో స్పష్టం..

హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.863 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి ప్యాకేజీ-4, ప్యాకేజీ-5లలో జీహెచ్ఎంసీ కమిషనర్ చేసిన సవరణలను ఆమోదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏఅండ్‌యూడీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీవో నెంబర్ 554 జారీ చేశారు. భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) పురోగతి, టెండర్ల ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు ఈ మార్పులు చేసినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఐదు రోడ్లు ఒకే ప్యాకేజీ కింద సవరించిన ప్రతిపాదనల ప్రకారం ప్యాకేజీ-4 కింద రూ. 620 కోట్లతో ఒకేసారి ఐదు రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులన్నింటికీ కలిపి ఒకే టెండర్ ప్రక్రియలు చేపట్టాలని కూడా సర్కారు ఆదేశాల్లో పేర్కొంది.

Advertisement

Also Read: వాషింగ్ మెషిన్‌లో బట్టలు కొత్త మెరవాలంటే.. లిక్విడ్ డిటెర్జెంట్‌తో పాటు ఈ 2 వేయండి

సవరించిన ప్రతిపాదనలు

1.అజీమ్ హోటల్ నుంచి చర్చి గేట్ వరకు (షోయబ్ హోటల్ నుంచి బాలాపూర్ రోడ్డు) 80 అడుగుల రోడ్డు విస్తరణ – (అంచనా వ్యయం రూ.11 కోట్లు)
2. చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్స్ నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా బార్కస్ వరకు 80
అడుగుల రోడ్డు – (రూ. 9 కోట్లు).
3.లక్కీ స్టార్ హోటల్ నుంచి హఫీజ్ బాబా నగర్ వరకు అడుగుల రోడ్డు విస్తరణ – (రూ. 50 కోట్లు)
4.బెంగళూరు జాతీయ రహదారి నుంచి శాస్త్రీపురం జంక్షన్ వరకు 100 అడుగుల రోడ్డు -(రూ. 225 కోట్లు)
5.శాస్త్రీపురం జంక్షన్ నుంచి ఇంజిన్ బౌలి వరకు 100 అడుగుల రోడ్డు పనులు -(రూ. 318 కోట్లు) చేపట్టనున్నారు.

ఇక ప్యాకేజీ-5 కింద..

Advertisement

1.రూ. 243 కోట్లతో తులసీనగర్ నుంచి గౌస్ నగర్ వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ పనులను స్పెషల్ టెండర్ ప్రక్రియ ద్వారా చేపట్టనున్నారు. ఈ పనులకు
సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), డిజైన్లు, డ్రాయింగ్స్ తయారీ కోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం
అనుమతిచ్చింది. భూసేకరణ, యుటిలిటీల మార్పులకు సంబంధించి భూసేకరణకు బదులుగా టీడీఆర్ జారీ చేయడం ద్వారా ఆదా అయ్యే నిధులతోనే ఈ అదనపు వ్యయాన్ని సర్దుబాటు చేస్తామని స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఈ సవరణలకు అంగీకారం తెలిపింది. హెచ్-సిటీ ప్రాజెక్టు కింద మొత్తం రూ.5,942 కోట్లతోనగరవ్యాప్తంగా 23 ఫ్లైఓవర్లు, ఆర్‌యూబీలు, రోడ్ల విస్తరణ పనులకు గతంలోనే (2024 డిసెంబరులో) పరిపాలనా అనుమతులు మంజూరు కాగా, అందులో భాగమైన ఈ పాతబస్తీ ప్యాకేజీల నిధుల్లో (రూ.863 కోట్లు) ఎలాంటి మార్పు లేకుండా చేసిన సవరణలకు తాజాగా ఆమోదం లభించింది.

Also Read: గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడండి: న్యూయార్క్ వరదల్లో లైవ్ వీడియో

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×