BigTV English

YS Jagan: 11 వచ్చినా తగ్గని వైఎస్ జగన్ ధీమా.. వచ్చే ఎన్నికల్లో 175 అంటూ ప్రకటన

YS Jagan: 11 వచ్చినా తగ్గని వైఎస్ జగన్ ధీమా.. వచ్చే ఎన్నికల్లో 175 అంటూ ప్రకటన

బాబు వస్తే బాదుడు కామన్


⦿ చంద్రబాబు సర్కార్ పై జగన్ ఫైర్
⦿ ఆరునెలలలోనే కూటమిపై వ్యతిరేకత
⦿ బాబు వస్తే బాదుడు తప్పదు
⦿ ఇప్పటికే కరెంట్ ఛార్జీల పెంపు
⦿ బూతద్దంలో తప్పులు వెదుకుతున్నారు
⦿ వచ్చే ఎన్నికలలో వైసీపీ పుంజుకుంటుంది
⦿ 13న రైతు సమస్యలపై ఉద్యమం
⦿ 27న కరెంట్ ఛార్జీల పెంపుపై నిరసన
⦿ 3న ఫీజు రీఇంబర్స్ మెంట్ పై ధర్నా
⦿ పచ్చమీడియాలో పిచ్చిరాతలు
⦿ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
⦿ పయ్యావుల వియ్యంకుడి బియ్యం లీలలు
⦿ వారిపై కేసులు ఉండవా?

అమరావతి, స్వేచ్ఛ: YS Jagan: చంద్రబాబు వచ్చాడు, ఇక బాబు బాదుడు మొదలయింది. బాబు వస్తే బాదుడు తప్పదు అన్నారు వైఎస్ జగన్. బుధవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధులతో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీల వైఫల్యంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కేవలం ఆరు నెలలు కాకుండానే ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించలేదని అన్నారు. ప్రతి చిన్న అంశాన్ని బూతద్దంలో చూపిస్తున్నారని అన్నారు. ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.


బాదుడు షురూ
కరెంట్ ఛార్జీల పెంపుతో ఇక బాదుడు మొదలు కానుందని అన్నారు. బాబు వస్తే బాదుడు తప్పదని మరోసారి నిరూపించారని అన్నారు. ప్రతిరోజూ పనిగట్టుకుని ముఖ్యమంత్రి చెప్పే అబద్దాలు, చేసే మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. నెమ్మదిగా గత పాలనలో జరిగిన మంచిని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలనాటికి వైసీపీ పుంజుకోవడం ఖాయం అన్నారు. అప్పటిదాకా కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను అందరం కలిసి ఎండగడదామని పిలుపునిచ్చారు జగన్. మళ్లీ మనం ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తామో అని భయపడి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నారన్నారు. పథకాల గురించి ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. మనకున్న విశ్వసనీయతే మనలను గెలిపిస్తుందని అన్నారు.

రూ.15 వేల కోట్ల భారం
కరెంట్ బిల్లులు తాకితేనే షాకిచ్చేలా ఛార్జీలు ఉంటున్నాయని అన్నారు. ఇప్పటికే రూ.15 వేల కోట్లుకు పైగా కరెంట్ ఛార్జీలు పెంచారన్నారు. గ్రామీణ రోడ్లకు కూడా పన్నులు వేద్దామనే యోచనలో బాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. బాబు దృష్టిలో సంపద సృష్టికి అర్థం బాదుడేనా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా నాలుగు పోర్టుల నిర్మాణం జరుగుతోందని అన్నారు. అవి పూర్తయితే ఆ క్రెడిట్ తమదే అని చెప్పుకుంటారని కూటమిపై మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, పోర్టుల రూపంలో మనమే సంపదను సృష్టించామని అన్నారు. అయితే వీటిని ఓ పద్ధతి ప్రకారం అమ్ముకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

పచ్చ మీడియా రాతలు
13 నుంచి రైతు సమస్యలపై ఉద్యమం చేస్తున్నామని అన్నారు. కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా 27న పెద్ద కార్యక్రమం జరుపుతున్నామన్నారు. జనవరి 3న ఫీజుల రీఇంబర్స్ మెంట్ పునరుద్ధరించాలని నిరసన కార్యక్రమాలు జరుపుతున్నామని అన్నారు. మన యుద్ధం చంద్రబాబుపై కాదు..పచ్చ మీడియా మీదే అన్నారు. పచ్చమీడియాలో పచ్చిరాతలను వ్యతిరేకించాలన్నారు. ప్రతిరోజూ డైవర్షన్ వార్తలు రాస్తూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారు ఈ పచ్చ మీడియా అన్నారు. రేషన్ బియ్యం పై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు పచ్చమీడియా మరింత కథనాలను వండి వారుస్తున్నదన్నారు. అధికారంలో ఉన్నది వారే , మరి అక్రమాలు జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.

నిందలన్నీ మాపైనా?
అధికార నేతలే దగ్గరుండి చెక్ పోస్టులు పెట్టిస్తున్నారు. పోర్టులలో వాళ్ల సిబ్బందే ఉన్నారు. నిందలన్నీ మనపై వేస్తూ చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. తప్పెక్కడ జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి అక్రమ పీడీఎస్ బియ్యం ఎగుమతులు చేస్తున్నారని అన్నారు. మరి వాళ్ల పేర్లు ఎందుకు బయటపెట్టరని అన్నారు. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతులు చేయడంలో నెంబర్ వన్ అని అన్నారు. లోతుగా విచారణ జరిపిస్తే పయ్యావుల వియ్యంకుడి వ్యవహారం బయటకు వస్తుందని జగన్ అన్నారు.

Also Read: AP 10th Exams Schedule 2025: ఏపీలో పది ‘పబ్లిక్’ పరీక్షల షెడ్యూల్ విడుదల..

డీలర్లకే మళ్లీ అధికారం
డీలర్ల వ్యవస్థతో అక్రమాలు జరుగుతున్నాయని నేరుగా వాహనాల ద్వారా ప్రజలకు చౌక బియ్యం అందించడం జరిగిందని అన్నారు. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చి నేరుగా డీలర్లకే అధికారాలు అప్పగించారని అన్నారు. తమ హయాంలో మంచి పథకాలన్నీ అటకెక్కించారని అన్నారు. రైతులు గత్యంతరం లేక దళారులకే ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారని అన్నారు. నాసిరకం బియ్యం చౌక ధరల దుకాణాలకు చేరుస్తున్నారని, మేలు రకం బియ్యం చేతులు

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×