E-Paper
Advertisement

వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

Vehicle Testing: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను మరింత పారదర్శకం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు’ (ఏటీఎస్) ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అత్యాధునిక సాంకేతికతతో వాహనాల సామర్థ్యాన్ని పరీక్షించాలనే లక్ష్యం బాగున్నా, దాని వెనుక జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సుమారు రూ. 296 కోట్ల భారీ వ్యయంతో 37 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినప్పటికీ, టెండర్ల దశలోనే ఈ ప్రాజెక్టు చిక్కుముడి పడింది.

ఆటోమేటెడ్‌గా పరిక్షించి..

ఏ వాహనానికైనా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు తప్పనిసరి. రాష్ట్రంలో ఇన్నాళ్లుగా మ్యానువల్‌గా జరుగుతూ వచ్చిన ఈ పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం ఆధునికతను జోడించబోతుంది. ఏ వాహనాన్నైనా ఆటోమేటెడ్‌గా పరిక్షించి ఫిట్​నెస్​ సర్టిఫికెట్​లు అందించే నూతన పద్ధతికి శ్రీకారం చుడుతుంది. ఇందుకు అవసరమైన ఆటోమేటెడ్‌ ఫిట్‌నెస్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒకటి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లో 4 అదనపు స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

టెండర్లు కంప్లీట్..

ఆర్ అండ్ బీ శాఖద్వారామొత్తం రూ.296 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం జీఓ28, 2024 సెప్టెంబర్ 30న న పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అయితే టెండర్లు కంప్లీట్ కాకపోవడంతో పెండింగ్ లో పడింది. టెండర్ కంప్లీట్ చేసి ఎటీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నప్పటికీ అడుగు ముందుకు పడటం లేదు. ప్రభుత్వం ఏటీఎస్ ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటిదశలో15 చోట్లఏటీఎస్ లనుఏర్పాటుచేస్తామని, ఉమ్మడి జిల్లాకేంద్రాల్లో ఒకటి, జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ పరిధిలో మిగిలినవి ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు. 2024-2025 ఆర్థికసంవత్సరంలో, తెలంగాణ ప్రభుత్వం 37 ఏటీఎస్ లకుప్రాథమికరిజిస్ట్రేషన్సర్టిఫికేట్లనుజారీచేసిందని ప్రకటించింది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారింది.

Also Read: Janasena vs Tdp : జనసేన వర్సెస్ టీడీపీ.. కుట్ర ఎవరు చేశారు?

ఖర్చుపై సందేహాలు.. అవినీతి ఆరోపణలు?

ఒక్కో ఏటీఎస్‌ కేంద్రం ఏర్పాటుకు దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఇంత భారీ మొత్తంలో నిధుల కేటాయింపు వెనుక ‘కోట్లలో చేతులు మారనున్నాయి’ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత 5 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసి ఒకేసారి 10కోట్లు అని ఇప్పుడు అధికారులు తిరిగి కోట్ చేయడం వెనుక అంతర్యమేంటనేది ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. ప్రైవేటు రంగంలో లేదా ఇతర రాష్ట్రాల్లో ఇంతకంటే తక్కువ వ్యయంతోనే ఇలాంటి కేంద్రాలు నడుస్తున్నాయని, ఇక్కడ మాత్రం అంచనాలను భారీగా పెంచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా సాఫ్ట్‌వేర్, సెన్సార్లతో కూడిన ఈ యంత్రాల ఏర్పాటుకు ఇంత ఖర్చు అవుతుందా? లేక అంచనాలను కావాలనే పెంచారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సాంకేతిక కారణాలా? రాజకీయ ఒత్తిళ్లా?

పరిపాలన అనుమతులు వచ్చి నెలలు గడుస్తున్నది. కానీ టెండర్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. సాధారణంగా రవాణా శాఖ పర్యవేక్షణలో జరగాల్సిన ఈ పనులను, ఆర్అండ్‌బీ శాఖకు అప్పగించడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు టెండర్ల ఖరారులో జరుగుతున్న ఆలస్యం వెనుక కొన్ని బడా కంపెనీలకు మేలు చేసే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే టెండర్లు ముందుకు పడటం లేదనే ప్రచారం జరుగుతోంది. లేకుంటే ఇంకా ఏమైనా సాంకేతిక కారణాలు ఉన్నాయా? అనే దానిపై అధికారులే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఒక్కో సెంటర్ 5 ఎకరాలు

ఒక్కో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ ను 5 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించాలని భావిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో, ప్రైవేట్ కు అప్పగిస్తే ప్రభుత్వానికి ఆదాయం రాదని, పారదర్శకత లోపిస్తుందనే ఉద్దేశ్యంతో రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే 5 ఎకరాల్లో వాహనాల ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలని, దీనికి యంత్రాల మెయింటెన్స్ బాధ్యతను మాత్రం ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆ మెయింటెన్స్ చేసినందుకు 96శాతం ప్రభుత్వానికి కేవలం నాలుగుశాతం మాత్రం ప్రైవేటుకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో మాత్రం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. అంతేకాదు మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల్లో ఏటీఎస్ సెంటర్ల పనితీరును అధికారులు అధ్యయనం చేశారు. ప్రభుత్వమే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

Also Read: కొత్త ఇంటికి శ్రీకారం చుట్టిన బన్నీ.. మేనమామ చిరంజీవి ఇంటికి సమీపంలో.. ఎన్ని కోట్లంటే?

పారదర్శకతకే మా ప్రాధాన్యం: కమిషనర్ ఇలంబరితి

వాహనం ఫిట్ నెస్ చేసి పారదర్శకంగా సర్టిఫికెట్ జారీ చేయడం కోసమే ఏటీఎస్ సెంటర్ల ఏర్పాట్లు. ఏటీఎస్ కేంద్రాల ఏర్పాటులో ఎలాంటి అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటాం. ఒక్కో సెంటర్ ను 5 ఎకరాలలో ఏర్పాటు చేయబోతున్నాం. దానికి చుట్టు కంచె, మౌలిక వసతులు, నాణ్యమైన యంత్రాలు , విశాల ప్రదేశం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే టెండర్ల బాధ్యతలను ఆర్అండ్‌బీకి అప్పగించాం, వారు పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తారు. వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల్లో మానవ ప్రమేయం తగ్గించి, ప్రమాదాలను అరికట్టడమే రావాణాశాఖ లక్ష్యం.

శిలాఫలకం వేసి 10నెలలు..

నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని దండెంపల్లిలో 8కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవనానికి గతేడాది జూలై 13న శంకుస్థాపన చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్,కోమటిరెడ్డిలు పాల్గొని రవాణా రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. వాహన ప్రమాదాలు నియంత్రించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతికతతో కూడిన ఏటీసీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పది నెలలు అయినప్పటికీ అడుగు ముందుపడటం లేదు.

Also read: కొత్త ఇంటికి శ్రీకారం చుట్టిన బన్నీ.. మేనమామ చిరంజీవి ఇంటికి సమీపంలో.. ఎన్ని కోట్లంటే?

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×