E-Paper
Advertisement

కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విచారణ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. సెక్షన్ 8B కింద నోటీసులు ఇవ్వలేదన్న సాంకేతిక కారణాన్ని కోర్టు ప్రస్తావించిందే తప్ప కమిషన్ ఏర్పాటును తప్పుబట్టలేదని స్పష్టం చేశారు. కమిషన్ నియామకాన్ని న్యాయస్థానం పూర్తిగా సమర్థించిందని వెల్లడించారు.

కోర్టు ఇచ్చిన తీర్పుపై రేపు నిర్వహించబోయే కేబినెట్ సమావేశంలో కూలంకషంగా చర్చిస్తామని మంత్రి చెప్పారు. మంత్రివర్గ చర్చ అనంతరం ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చడం ద్వారా విచారణ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు.

Advertisement

ప్రభుత్వానికి అందిన వివిధ నివేదికల ప్రకారం మూడు బ్యారేజీలలో భారీ స్థాయిలో లోపాలు ఉన్నట్లు తేలిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మేడిగడ్డ సహా ఇతర ప్రాంతాల్లో నిర్మాణ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్లు ఖర్చు చేసి పనికిరాని ప్రాజెక్టులు కట్టిన వారు ఇప్పుడు తిరిగి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కూలాయని చెప్పడం ద్వారా విపత్తు తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం అక్రమాలపై సీబీఐకి పంపిన రిపోర్టులలో ఎవరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. జస్టిస్ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికను యధావిధిగా కేంద్ర దర్యాప్తు సంస్థకు అందజేశామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా బాధ్యులెవరనేది సీబీఐ నిర్ధారిస్తుందని స్పష్టం చేశారు. కోర్టు ఎవరికీ క్లీన్ షీట్ ఇవ్వలేదని గుర్తుంచుకోవాలని సూచించారు. అక్రమాలకు పాల్పడిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

Advertisement

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టుల నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన ప్రజా ధనం వృథాపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక లోపాలు అలాగే అవినీతి కోణాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రేపటి కేబినెట్ భేటీలో తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయని ఆయన అన్నారు.

ALSO READ: మేడిగడ్డపై హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Related News

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

Big Stories

Advertisement
×