Hyderabad: తెలంగాణలో ఉప ఎన్నికల వేడి మొదలైంది. ఖైరతాబాద్ బైపోల్‌పై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సీటు తమదేనని కుండబద్దలు కొట్టేశారు ఆయన. అందుకు కొన్ని కారణాలు చెప్పారు. ఇంతకీ ఆ కారణాలేంటి?
తెలంగాణలో ఉప ఎన్నిక వేడి అప్పుడే మొదలైంది. ఇప్పటికే ప్రధాన మూడు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఎవర్ని రంగంలోకి దించాలా? అనేదానిపై లోలోపల సర్వేలు నిర్వహించాయి. సరైన అభ్యర్థిని నిలబెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖైరతాబాద్ బైపోల్‌లో తాము కచ్చితంగా గెలిచి తీరుతామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు. అందుకు ఆయన కొన్ని కారణాలు చెప్పారు. అది మైనార్టీ సీటుకాదని, అక్కడ మాకు మెజార్టీ వచ్చిందని, గతంలో ఆ సీటు తాము గెలిచామని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ రెండేళ్ల లోపు జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని మనసులోని మాట బయటపెట్టారు. జూబ్లీహిల్స్ లో మాకు ఓటు బ్యాంకు లేదని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉందని, గతంలో ఆ సీటు తాము గెలిచామని చెప్పకనే చెప్పారు.
గతంలో దత్తాత్రేయ ఎంపీగా గెలిచినప్పుడు ఆ సెగ్మెంట్‌లో లీడ్ వచ్చిందని గుర్తు చేశారు. మొన్న కిషన్ రెడ్డి పోటీనప్పుడు కూడా మాకు లీడ్ వచ్చిందని వివరించారు. అక్కడ మా పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ అనేది వేరని అన్నారు. 100 శాతం గెలుపు తమదేనని తేల్చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తామని, అభ్యర్థి ఎవరు అనేది కూడా తెలియాల్సి వుందన్నారు.
ALSO READ: సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!
హైదరాబాద్-రంగారెడ్డి ఎమ్మెల్సీ సీటు గతంలో తాము గెలిచామని, మొన్న ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయామని వివరించారు. మీరు పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు నేరుగా బదులు ఇవ్వలేదు. పార్టీ నిర్ణయం ఫైనల్ అని తప్పించుకునే ప్రయత్నం చేశారాయన. మా పార్టీలో పోటీ చేసేందుకు చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని, అభ్యర్థి ఎవరనేది మా పార్టీలో ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. పార్టీ చెబితే నేను, లేకుంటే మరెవరైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు. గతంలో ఒక్కసారి ఆయన ఆ సీటు గెలుపొందడంతో ఎక్కువ అవకాశాలు ఆయనకు ఉంటాయనే టాక్ అప్పుడే ఆ పార్టీలో మొదలైంది.
Telangana BJP Chief Ramchander Rao About Khairatabad By Election 2026 | Straight Talk | BIG TV#ramchanderrao #bjp #straighttalk pic.twitter.com/8oFXAoXzXQ
— BIG TV Breaking News (@bigtvtelugu) October 3, 2026