E-Paper
Advertisement

351 ప‌రుగులు చేసినా ఓడిపోతారా ? బౌల‌ర్ల‌నే కాదు, గిల్ ను కూడా పీకిపారేయండి

351 ప‌రుగులు చేసినా ఓడిపోతారా ?  బౌల‌ర్ల‌నే కాదు, గిల్ ను కూడా  పీకిపారేయండి
Advertisement

Danish Kaneria On Shubman Gill: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ (ind vs wi Odi) మధ్య మూడవ వన్డే నిన్న ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే ఈ మ్యాచ్ లో 351 పరుగులు సాధించిన టీమిండియా, వెస్టిండీస్ చేతిలో ఓడిపోవలసి వచ్చింది. దీంతో కెప్టెన్ గిల్ పై (Shubhman Gill) తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడికి కెప్టెన్సీ చేతకావడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీలు. లేటెస్ట్ గా పాకిస్తాన్ లెజెండరీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా ఈ మ్యాచ్ పై స్పందించారు. 351 పరుగులు చేసి… సొంత గడ్డపై డిఫెండ్ చేసుకోకపోవడం చేతకానితనమని ఫైర్ అయ్యారు. ప్రస్తుత బౌలర్లతో పాటు గిల్ కెప్టెన్సీ ( Shubman Gill captaincy) కూడా తొలగించాల్సిందేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు డానిష్ క‌నేరియా ( Danish Kaneria).

టీమిండియా బౌలర్లతో పాటు కెప్టెన్ గిల్ ను కూడా తొలగించాల్సిందే

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూడవ వన్డేలో టీమిండియా ఫెయిల్యూర్స్ బయట పడ్డాయని డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌలర్లే కాదు కెప్టెన్ గిల్ కూడా విఫలమయ్యాడని ఫైర్ అయ్యారు. ఒక్కడుంటే ఒక్కడు సరిగ్గా బౌలింగ్ చేయలేదని మండిపడ్డారు. సొంత గడ్డపై బౌలర్లు ఇలా ప్రదర్శన కనబరిస్తే.. రేపు దక్షిణాఫ్రికాపై వరల్డ్ కప్ ఎలా ఆడతారని నిలదీశారు. ఇక ఉన్న బౌలర్లను.. వినియోగించుకోవడంలో కెప్టెన్ గిల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని సీరియస్ అయ్యారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

ఇలాంటి కెప్టెన్ తో వరల్డ్ కప్ కు వెళ్తే టీమిండియా కొంప మునగడం గ్యారంటీ అని హెచ్చరించారు. వెంటనే బీసీసీఐ మొద్దు నిద్ర వీడాలని చురకలు అంటించారు. బౌలర్లతో పాటు కెప్టెన్ గిల్ ను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. జట్టులో ఉన్న రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని ఆయన కోరారు. భువనేశ్వర్ కుమార్, బుమ్రా, మహమ్మద్ షమీలను బరిలోకి దించాలని సూచనలు చేశారు డానిష్ కనేరియా.

టీమిండియా బౌల‌ర్ల‌పై గిల్ సీరియ‌స్

Advertisement

వెస్టిండీస్ తో జరిగిన మూడవ వన్డే సందర్భంగా టీమిండియా ఓటమిపై కెప్టెన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్యాటింగ్ అలాగే ఫీల్డింగ్ అదరగొట్టాం… కానీ తమ బౌలర్లే చెత్తగా ప్రదర్శన కనబరిచారని ఆయన సీరియస్ అయ్యారు. మా వాళ్లు సరిగ్గా బౌలింగ్ చేసి ఉంటే కచ్చితంగా మ్యాచ్ గెలిచే వాళ్ళమని వ్యాఖ్యానించారు. అయితే గిల్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో కౌంటర్లు పేలుతున్నాయి. సరిగ్గా బౌలర్లను వాడుకోవడం చేతకాక మ్యాచ్ పోగొట్టింది నువ్వు అంటూ ఫైర్ అవుతున్నారు.

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

 

Related News

అంపైర్లు నిద్ర‌పోతున్నారా ? రూథ‌ర్ ఫోర్డ్ అస‌లు ఔటే కాదు…ఆకాశ్ చోప్రా సీరియ‌స్‌

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌

వైభ‌వ్ కు కాదు, నీకు జోల పాట పాడే టైం ద‌గ్గ‌ర ప‌డింది..సైమ్ సెల‌బ్రేష‌న్స్ పై క‌మ్రాన్ సీరియ‌స్

పాకిస్తాన్ క్రికెట్ లో అందరూ దద్దమ్మలే…PCB ఆఫ‌ర్ పై షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం

6 సిక్సర్లు కొడతానని…బుమ్రా బౌలింగ్‌లో మూతి పళ్ళు రాలగొట్టుకున్న ఫర్హాన్

సింధు జలాలు ఇస్తాం కానీ, క్యాచ్‌లు వదిలేసేయ్…సైమ్ అయూబ్‌ను ఆడుకున్న ఫ్యాన్స్

ఫైనల్స్‌లో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన 24 ఏళ్ల కుర్రాడు.. ఇంతకు ఎవరీ హసన్ నవాజ్ ?

Big Stories

Advertisement
×