BigTV English

TS Cabinet Meeting Decisions: 16 కార్పొరేషన్లు ఏర్పాటు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

TS Cabinet Meeting Decisions: 16 కార్పొరేషన్లు ఏర్పాటు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

TS Cabinet


Telangana Cabinet Meeting Decisions: తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.

6 గ్యారంటీల అమలుపైనా మంత్రివర్గ భేటీలో చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆమోద ముద్ర వేశారు. తొలి దశలో 4 లక్షల 56 ఇళ్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అర్హులకు కొత్త తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది.


తెలంగాణ మంత్రిమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓబీసీ , ఎస్సీ, ఎస్టీల కోసం 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మంత్రి మండలి ఆమోదించిన కార్పొరేషన్లు..
1. ముదిరాజ్ కార్పొరేషన్
2. యాదవ కార్పొరేషన్
3. మున్నూరు కాపు కార్పొరేషన్
4. పద్మశాలి కార్పొరేషన్
5.పెరిక (పురగరి క్షత్రియ ) కార్పొరేషన్
6. లింగాయత్ కార్పొరేషన్
7. మేర కార్పొరేషన్
8. గంగపుత్ర కార్పొరేషన్

Also Read : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 22 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన మంత్రులు

9. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
10. ఆర్య వైశ్య కార్పొరేషన్
11. రెడ్డి కార్పొరేషన్
12. మాదిగ , మాదిగ ఉప కులాల కార్పొరేషన్
13. మాల , మాల ఉప కులాల కార్పొరేషన్

14. ఆదివాసీ కార్పొరేషన్ (కొమురం భీం)
15.సంత్ సేవాలాల్ లంబాడీ కార్పొరేషన్
16. ఏకలవ్య కార్పొరేషన్

స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించడంపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్‌ఆర్‌ చుట్టూ 25 నుంచి 30 ఎకరాల్లో ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపైనా కేబినెట్ చర్చించింది. జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలోని జరుగుతున్న విచారణ వంద రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది. యాదాద్రి, భద్రాది విద్యుత్ ప్రాజెక్టులు, కరెంట్ కొనుగోళ్ల అంశంపై రిటైర్డ్ జడ్డి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ చేయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండురోజుల్లో 93 శాతం రైతు బంధు నిధులు జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×