Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ సమావేశం విజయవంతంగా ముగిసింది. పలు కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ పాలసీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.9వేల కోట్లను విజయవంతంగా రైతుల అకౌంట్లలో జమచేసినందుకు గానూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. సచివాలయం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతుభరోసా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడనున్నారు.
ALSO READ: CHSL Jobs: ఇంటర్‌తో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్
రెవిన్యూ సదస్సులో వచ్చిన 9లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ చేపట్టి క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రైతు సమస్యలను పరిష్కరించాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
ALSO READ: Pawan Kalyan: యువతకు భారీ గుడ్‌న్యూస్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ మినిట్స్‌తో కూడిన పూర్తి నివేదక ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.