BigTV English

CM Revanth Reddy: పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు.. సీఎల్పీ మీటింగ్‌లో సీఎం సీరియస్

CM Revanth Reddy: పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు.. సీఎల్పీ మీటింగ్‌లో సీఎం సీరియస్

CM Revanth Reddy: పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పదవులపై బహిరంగ మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని.. ష్టమే జరుగుతుందని చెప్పారు. మంగళవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు. ఎవరైనా పదవులపై బయట మాట్లాడితే మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుందన్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఇప్పటికే అనేకసార్లు చెప్పినని.. లీడర్లు అర్ధం కాకపోతే ఎలా అంటూ ఫైరయ్యారు.


ఎమ్మెల్యేలకు CM రేవంత్ సీరియస్ వార్నింగ్

అంతర్గత వ్యవహారాలు బయటపెట్టి.. పార్టీ పరువు తీయొద్దని హెచ్చరించారు. పార్టీ డ్యామేజ్ అయ్యేలా వ్యవహరించవద్దన్నారు. పదవులు ఇచ్చేది అధిష్టానం.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని క్లారిటీ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి కామెంట్స్ ఎవరు చెయ్యొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్‌తోనైనా కేబినెట్ చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది చూడాలి. తీరు మారకుంటే కష్టమని రేవంత్ క్లారిటీగా చెప్పారు. అయినా మళ్లీ మంత్రుల పదవులపై కామెంట్స్ చేస్తే పార్టీ, హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న చర్చ జరుగుతుంది.


సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అంతే కాకుండా ప్రభుత్వ పథకాలను జనాల్లోకి మరింతగా తీసుకెళ్లాలని.. పార్టీ ఐక్యతను కాపాడేలా నడుచుకోవాలన్నారు. రేపటి నుంచి జూన్ 2వరకు నియోజకవర్గాల్లో పర్యటించాలన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ విజయం సాధించేలా ప్రణాళిక రచించాలని.. సీఎల్పీలో చర్చ జరిగింది.

సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ఎస్సీ వర్గీకరణ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. కీలక అంశాలపై చర్చించారు. సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ఎస్సీ వర్గీకరణ, కుల గణన, బీసీ రిజర్వేషన్ల వంటి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రధానంగా ఎమ్మెల్యేలకు పలు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రభుత్వ పథకాలను వివరించాలని ఆదేశించారు. సోషల్ మీడియా, క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాలని సూచించారు.

పార్టీ లైన్‌ను దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరిక

కొందరు ఎమ్మెల్యేలు పార్టీ లైన్‌ను దాటుతున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌ హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని, అంతర్గతంగా వాటిని డిస్కస్ చేయాలని సూచించారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడవద్దని సూచించారు. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే జీతం నుంచి 25 వేలు పార్టీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పదవులు రానివారు.. అద్దంకి దయాకర్‌లా ఓపికగా ఉండాలన్నారు. దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యారని గుర్తుచేశారు. అద్దంకి తన జీతం నుంతి 10శాతం AICCకి.. 15శాతం PCCకి ఇస్తున్నారన్నారు.

వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని, అంతర్గతంగా చర్చించాలని సూచన

మంత్రి పదవులు ఆశిస్తున్న ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, రాజగోపాల్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ సీఎల్పీ మీటింగ్‌కు అటెండ్‌ అయ్యారు. అటు ఎంపీ చామల కిరణ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్‌ తీసుకున్నారు. రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తున్నావని.. అది మంచి పద్ధతి కాదన్నారు. మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది.. హైకమాండ్‌ చూసుకుంటుందని చెప్పారు.

విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఆఖరిదని స్పష్టీకరణ

లెజిస్టేటివ్ పార్టీ మీట్ లో బీఆర్ఎస్, బీజేపీల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కొనే వ్యూహాలపైనా చర్చ జరిగింది. ప్రతిపక్షాలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రూపొందించారు. పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసి, ప్రజల్లో విశ్వాసం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు

Related News

Hyderabad Water Cut: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. నగరంలో రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Big Stories

×