T-Congress Manifesto Released for Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సరిగ్గా 10 రోజులే సమయం ఉంది. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వారంరోజుల్లో తెర పడనుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. రోడ్ షో లు, బహిరంగ సభలు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీ కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లోన సత్తా చాటాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి.. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమేం చేస్తుందో ఈ మేనిఫెస్టో ద్వారా వెల్లడించనున్నారు.
Also Read: రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా : రేవంత్ రెడ్డి
రాష్ట్ర విభజన హామీల అమలు, స్పెషల్ కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు వంటి అంశాలను ఈ మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే న్యాయ్ పత్ర్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. 48 పేజీలతో కూడిన మేనిఫెస్టోలో మహిళలు, రైతులు, యువతకు సంబంధించిన హామీలను ప్రకటించింది. ఒక్కో గ్యారెంటీ కింద ఐదేసి హామీల చొప్పున.. మొత్తం 25 హామీలను ప్రకటించింది. మరి తెలంగాణ మేనిఫెస్టోలో కొత్తగా ఎలాంటి హామీలిస్తుందో చూడాలి.