BigTV English

Pawan Kalyan : కాకినాడపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.. అక్కడ నుంచే పోటీ చేస్తారా..?

Pawan Kalyan : కాకినాడపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.. అక్కడ నుంచే పోటీ చేస్తారా..?

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఆయన పోటీ చేసే స్థానంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచే మళ్లీ బరిలోకి దిగుతారా? లేదంటే ఆ రెండు నియోజకవర్గాల్లో ఒకచోట నుంచి పోటీ చేస్తారా? లేక ఈసారి కొత్త స్థానం నుంచి పోటీలో ఉంటారా? ఇదే చర్చ ఇప్పుడు నడుస్తోంది.


కాకినాడపై జనసేనాని పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక దృష్టి పెట్టడంతో మరో చర్చ తెరపైకి వచ్చింది. కాకినాడ నుంచే పవన్‌ పోటీ చేస్తారని కార్యకర్తలు అంటున్నారు. కాకినాడనే సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అక్కడే ఇళ్లు కూడా చూసేందుకు కార్యకర్తలు రంగంలోకి దిగినట్లు సమాచారం.

ఒకవేళ కాకినాడ నియోజకవర్గంలో పవన్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై ఉంటుందనే భావిస్తున్నారు. కాకినాడలో వివిధవర్గాల వారితో స్వయంగా మాట్లాడుతున్నారు పవన్. ఇప్పటికీ 50 వార్డులో 28 వార్డులను చుట్టేశారు. మరో 22 వార్డులను పవన్‌ సమీక్షించనున్నారు.


కొన్నిరోజులుగా జనసేనాని కాకినాడపై ఫోకస్ పెట్టారు. అందుకే ఆయన ఇక్కడ నుంచే పోటీ చేస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు. మరి పవన్ మనసులో ఏముందోమరి.

Related News

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

Big Stories

×