Ganesh Immersion Holiday: వినాయకుడి నిమజ్జనాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25వ తేదీని సెలవు దినంగా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సెలవు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
అయితే సెప్టెంబర్ 25న ప్రకటించిన సాధారణ సెలవును రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కొన్ని ప్రాంతాలకు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధికి ఈ సెలవు వర్తిస్తుందని సీఎస్ సంజయ్ జాజు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
Also Read: జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!
మరోవైపు సెప్టెంబర్ 25 సెలవు నేపథ్యంలో మరో పబ్లిక్ హాలీడేను వర్కింగ్ డేగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 14వ తేదీన వచ్చిన రెండో శనివారాన్ని సెలవుకు బదులుగా పనిదినంగా పరిగణించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ రోజున యధావిధిగా విధులు నిర్వర్తించాలని సూచించింది.