Fantasy Romantic Drama: స్విట్జర్లాండ్ అందమైన లొకేషన్ల నేపథ్యంలో సాగే ఒక మ్యాజికల్ ఫాంటసీ రొమాంటిక్ సినిమా ‘Tara & Akash: Love Beyond Realms’. మ్యాజికల్ రియలిజం, ఫాంటసీ, ఫీల్-గుడ్ రొమాన్స్, డ్రామా జానర్ల కలయికగా సాగే ఒక వినూత్నమైన సినిమా ఇది. సాధారణ ప్రేమకథలకి భిన్నంగా, మన ప్రపంచానికి అవతల ఉన్న ఆస్ట్రల్ రియల్మ్ (మరో లోకం) మ్యాజికల్ ఎలిమెంట్స్‌ను ఇందులో మేళవించారు. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఆత్మబంధాల చుట్టూ తిరిగే భావోద్వేగాలు ఈ చిత్రంలో ప్రధానంగా కనిపిస్తాయి. స్విట్జర్లాండ్‌లోని అందమైన విజువల్ లొకేషన్లతో కూడిన మ్యాజికల్, ఫాంటసీ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారికి ఇది ఒక కొత్త తరహా సినిమా అనుభూతిని ఇస్తుంది.
22 ఏళ్ల తార తన తల్లిదండ్రుల మాటలను పక్కనపెట్టి ఒంటరిగా స్విట్జర్లాండ్‌కు ప్రయాణమవుతుంది. తన అమ్మమ్మ జ్ఞాపకాలతో ముడిపడిన ఓ పాత రొమాన్స్ నవల ఆమెకు ఈ ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తుంది. అక్కడ అందమైన ప్రకృతి మధ్య తిరుగుతున్న సమయంలో ఆమెకు ఆకాశ్ అనే మిస్టీరియస్ యువకుడు ఎదురవుతాడు. మొదట ఇద్దరి మధ్య అపార్థాలు, చిన్న చిన్న గొడవలు ఉన్నా క్రమంగా స్నేహం పెరుగుతుంది.
కానీ ఆకాశ్ సాధారణ యువకుడు కాదని తారకు తెలిసిన తర్వాత కథ అసలు మలుపు తిరుగుతుంది. అతడు మరో లోకానికి చెందిన ఆస్ట్రల్ బీయింగ్, లైట్ రియల్మ్ నుంచి వచ్చిన ఒక ప్రత్యేకమైన ఉనికి. అతడి రాక వెనుక ఓ మిషన్ కూడా ఉంటుంది. అయినప్పటికీ తార, ఆకాశ్ మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి స్విట్జర్లాండ్‌లో ప్రయాణిస్తూ తమ గతం, తమ బంధం, జీవితానికి ఉన్న అర్థం గురించి తెలుసుకుంటారు. చివరికి భౌతిక ప్రపంచానికి, మరో లోకానికి మధ్య ఉన్న గీతను ఈ ప్రేమ దాటగలదా అనేదే అసలు ప్రశ్నగా మారుతుంది. క్లైమాక్స్ లో వీళ్ళ లవ్ స్టోరీకి ఎలాంటి ముగింపు ఇచ్చారో తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని చూడాల్సిందే.
శ్రీనివాస్ అబ్రోల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలంకృత బోరా, జితేష్ ఠాకూర్, అమోల్ పాలేకర్, దీప్తి నవల్, బృజేంద్ర కాలా తదితరులు నటించారు. సినిమా నిడివి సుమారు 2 గంటల 7 నిమిషాలు. ఇది ఫాంటసీ, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, డ్రామా జానర్ల కలయిక. JioHotstarలో సెప్టెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ.