E-Paper
Advertisement

మహిళా సంఘాలకు సర్కార్ బంపర్ ఆఫర్.. 11 రకాల వ్యాపార రుణాలు!

మహిళా సంఘాలకు సర్కార్ బంపర్ ఆఫర్.. 11 రకాల వ్యాపార రుణాలు!
Advertisement

Livestock Scheme: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పేదల జీవనోపాధిని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే లక్ష్యంతో గొర్రెలు, పొట్టేళ్లు అలాగే పేరటికోళ్ల (నాటుకోళ్లు) పెంపకానికి పెద్దపీట వేసింది. సామాజిక పెట్టుబడి నిధి (సీఐఎఫ్) కింద ఈ పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ, ఈ ఏడాది ఏకంగా 1.62 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 77.23కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

2026–27 ఆర్థిక సంవత్సరంలో..

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలువుతున్న జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) కింద పశుసంవర్ధక, జీవనోపాధి కార్యకలాపాలకు పెద్దపీట వేశారు. గొర్రె పొట్టేళ్లు, పెరటి కోళ్లు, కంజులు పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నారు. రాబోయే 2026–27 ఆర్థిక సంవత్సరంలో పశుపోషణ రంగాన్ని మరింత విస్తరించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక పెట్టుబడి నిధి కింద రూ.77.23 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో 1.90 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యాన్ని పెట్టుకున్నది.

11 రకాల పశుపోషణాధారిత జీవనోపాధి..

Advertisement

రాష్ట్రంలో 2023 నుంచి ఈ ఏడాది మే వరకు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ (ఎన్​ఆర్​ఎల్​ఎం) కింద కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సీఐఎఫ్​) ద్వారా రూ.107 కోట్లతో దాదాపు 1,25,410 స్వయం సహాయక సంఘాల్లోని 1.25 లక్షల మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 553 మండల సమాఖ్యల పరిధిలో 11 రకాల పశుపోషణ ఆధారిత జీవనోపాధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 75,011 బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ (పెరటి కోళ్ల పెంపకం) యూనిట్లు నెలకొల్పారు. మహిళలకు స్థానికంగానే ఆదాయం సమకూరేలా వివిధ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 787 గొర్రెలు, మేకల పిల్లల నర్సరీలను ఏర్పాటు చేశారు.

Also Read: అక్రమ పింఛన్ దారుల లక్కీ డేస్ క్లోజ్.. సీఎం రేవంత్ వద్ద బ్లాక్ లిస్ట్ రెడీ!

ఒక్కో కోడి 150 గుడ్లు.. 

Advertisement

గ్రామాల్లో మహిళలు స్వశక్తితో ముందుకు సాగేందుకు ఇప్పటికే ప్రభుత్వం రుణాలు అందజేస్తుంది. ఆర్టీసీబస్సులు, పెట్రోల్ బంకులు సైతం ఏర్పాటు చేయిస్తుంది. మరింత ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు సామాజిక పెట్టుబడి నిధి కింద రుణాలు అందజేస్తుంది. నాణ్యమైన కోడి పిల్లలను మహిళలకు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 587 మదర్ యూనిట్లను సుమారు 2లక్షల రుణంతో ఏర్పాటు చేయించారు. ఈ మదర్ యూనిట్లలో కోడిపిల్లలను పెంచి, టీకాలు వేసిన తర్వాతే లబ్ధిదారులైన మహిళలకు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో కోడి 150 నుంచి 180 కోడిగుడ్లను పెడుతుందని అధికారులు తెలిపారు. ఈ కోళ్ల పెంపకానికి ఉపాధిహామీ పథకం కింద షెడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఆర్డర్స్ ఇస్తే సరఫరా చేస్తున్నారు.

మూడేళ్లలో దాదాపుగా 2.25 లక్షల మందికి రుణం

2023 నుంచి రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపుగా 2.25 లక్షల మంది ఎస్​హెచ్​జీ మహిళలకు వేర్వేరు లైవ్‌స్టాక్ యూనిట్లను అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకల పెంపకానికి మంచి డిమాండ్ ఉండటంతో మహిళలకు రుణాలు అందిస్తున్నారు. ఒక యూనిట్ గొర్రె పొట్టేళ్ల పెంపకానికి రూ. 95 వేల నుంచి రూ.2లక్షల వరకు ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారు. బ్యాంకులు కేవలం 4 శాతానికే వడ్డీ కింద సీఐఎఫ్ రుణాలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు సబ్సిడీలు మాత్రం ఈపథకం కింద వర్తించదు.

Also Read: జూనియర్ ఐఏఎస్‌లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ టూర్ లిస్ట్‌లో బిగ్ చేంజెస్!

పీఎంఎంఎస్​వై కింద సబ్సిడీ

దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద సబ్సీడీపై రుణాలు అందజేస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్​వై) కింద 60 శాతం సబ్సిడీతో 81 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్లను (చేపల విక్రయ వాహనాలు) అందించారు. వీటితోపాటు 63 ఫిషరీస్ యూనిట్లను నెలకొల్పడం జరిగింది. మత్స్యకారులకు వలలను సైతం రుణంపై ఇస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తుల విక్రయాల కోసం 90 మిల్క్ పార్లర్లు, పశుగ్రాసం కోసం 77 చాఫ్ కట్టర్లు (గడ్డి కత్తిరించే యంత్రాలు), 55 పశుగ్రాస (ఫాడర్) యూనిట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మధిర , పరకాల ప్రాంతాలలో ‘ఇందిరా మహిళా డెయిరీ’లను విజయవంతంగా స్థాపించారు.

23 కౌజు పిట్టల (క్వెయిల్) పెంపకం

23 కౌజు పిట్టల (క్వెయిల్) పెంపకం యూనిట్లను సైతం ప్రారంభించారు. మహిళా సాధికారత, గ్రామీణ ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. అయితే లబ్దిదారుల ఎంపీకలో సెర్ప్ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాల గ్రూపులు ఉండటం, వారు ఆసక్తి చూపుతుండటంతో పెరటికోళ్ల పెంపకానికి రూ.10వేలురుణం ఇస్తున్నారు. 11 రకాలపశుజావనోపాధులను బట్టి రుణం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ప్రభుత్వం రుణాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు.

Also Read: కాళ్లు చేతులు కట్టేసి ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ని కోసిన మహిళ.. ఎందుకంటే?

Related News

గల్లీలో కొట్లాటలు.. ఢిల్లీలో కౌగిలింతలు.. బీజేపీ నేతల నాటకానికి హైకమాండ్ చెక్!

అక్రమ పింఛన్ దారుల లక్కీ డేస్ క్లోజ్.. సీఎం రేవంత్ వద్ద బ్లాక్ లిస్ట్ రెడీ!

జూనియర్ ఐఏఎస్‌లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ టూర్ లిస్ట్‌లో బిగ్ చేంజెస్!

తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి.. సీఐఐ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ఫార్ములా-ఈ స్కామ్‌లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

మేడ్చల్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణపై ఈసీఐ సెక్రటరీ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×