E-Paper
Advertisement

తోటి కంటెస్టెంట్ చేతిలో దారుణంగా మోసపోయిన నూకరాజు!

తోటి కంటెస్టెంట్ చేతిలో దారుణంగా మోసపోయిన నూకరాజు!
Advertisement

Kissik Talks on Nookaraju:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ టాక్ షోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కిస్సిక్ టాక్స్ షో (Kissik Talks Show)కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా ప్రసారమవుతున్న ఈ షో కి ఊహించని టీఆర్పీ రేటింగ్ లభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వెండితెర నుండి బుల్లితెర వరకు సినిమాల నుండి షోల వరకు ఎంతో మంది సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా 69వ ఎపిసోడ్ కి సంబంధించి లేటెస్ట్ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో గెస్ట్ గా జబర్దస్త్ (Jabardasth) కమెడియన్ నూకరాజు (Nookaraju) వచ్చారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఎన్నో పంచుకున్న ఆయన తన తోటి కంటెస్టెంట్ చేతిలో దారుణంగా మోసపోయాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

తోటి కంటెస్టెంట్ చేతిలో మోసపోయిన నూకరాజు..

హోస్ట్ గా వ్యవహరిస్తున్న వర్ష (Varsha) ప్రశ్నిస్తూ.. నిన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించగా.. గట్టిగా నవ్వేశారు నూకరాజు . ఆ నవ్వులో చాలా అర్థాలు వస్తాయి అని మళ్లీ తిరిగి వర్ష అడగగా.. నూకరాజు మాట్లాడుతూ..” దానిని వెన్నుపోటు అనలేము. కానీ నా వెనుకల తిరిగే ఒక ఆర్టిస్ట్ కి.. వాళ్ల చెల్లికి ఒంట్లో బాగోలేదంటే.. పేపర్ మీద రాయించకుండా.. ఎటువంటి పూచీ కత్తు లేకుండా ఏకంగా రూ.13 లక్షలు ఇచ్చాను.” అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇకనైనా జాగ్రత్త – ఫ్యాన్స్..

Advertisement

మొత్తానికి అయితే ఒక వ్యక్తిని నమ్మి ఇంత మొత్తంలో డబ్బు ఇవ్వడం, తిరిగి ఆ వ్యక్తి ఇవ్వకపోవడం లాంటి విషయాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అంతేకాదు ఒక వ్యక్తిని అంత ఈజీగా ఎలా నమ్మావన్నా అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నూకరాజు ఏకంగా అంత పెద్ద మొత్తంలో డబ్బు మోసపోయారు అని తెలిసి అభిమానులు ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అంటూ సలహాలు ఇస్తున్నారు.

Also read: బిగ్ బాస్ 10కి ముహూర్తం ఫిక్స్.. కంటెస్టెంట్స్ విషయంలో గందరగోళం!

కూలి పనుల నుండి స్టార్ హోదా వరకు..

Advertisement

నూకరాజు ఆంధ్రప్రదేశ్ అమలాపురానికి చెందినవారు. ఇండస్ట్రీలోకి రాకముందు బాల్యం నుంచే ఎన్నో చిన్నచిన్న పనులు చేస్తూ తన బాల్యాన్ని గడిపిన ఆయన.. ఆ తర్వాత ఆ కష్టాలను అధిగమించి.. శారీరక శ్రమను తట్టుకొని.. నేడు టెలివిజన్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. జబర్దస్త్ లో ఉత్సాహభరితమైన , విలక్షణమైన కామెడీ స్కిట్లతో పేరు గడించిన నూకరాజు.. ఎమోషనల్ పండించాడు అంటే ఎదుటివారు ఎంతటి వారైనా సరే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో తనదైన ముద్ర వేసుకున్న ఈయన.. 2022లో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని ‘ అనే చిత్రంలో కూడా నటించారు.

Related News

పెద్దోడి డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో వైరల్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 16th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మలో ప్రవేశించనున్న ఆరు ఆత్మ..?  

Gundeninda GudiGantalu Today episode: సుమతి హెల్ఫ్ తో మీనా హ్యాపీ.. భర్తకు సేవలు చేసిన రోహిణి.. ప్రభా దెబ్బకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో మాలినిని చూసి షాకైన జ్యోత్స్న      

Podarillu Today Episode : శేఖర్ ను రెచ్చగొట్టిన చక్రీ.. పెద్దోడి పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ ను విడగొట్టేందుకు ప్లాన్.. తిరుపతి శోభనం క్యాన్సిల్.. వల్లికి దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అవని ప్లాన్ సక్సెస్.. ఇదేం ట్విస్ట్ రా నాయనా..

Ninnu kori Serial Today Episode September 16th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్‌ ను సామ్రాట్‌ అనుకుని తీసుకెళ్లిన వాళ్ల అమ్మ – అయోమయంలో చంద్ర  

Big Stories

Advertisement
×