BigTV English

TSRTC : ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. మొత్తం ఎన్నంటే..?

TSRTC : ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. మొత్తం ఎన్నంటే..?

TSRTC : ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల( Bread winner Scheme) కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


విధి నిర్వహణలో మరణించిన వారి వారసులతో కండక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ నిర్ణయంతో విధి నిర్వహణలో మరణించిన కుటుంబాలకు ఊరట లభించనుంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పదేళ్ల పెండింగ్ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు మంత్రి.

కారుణ్య నియామకాల్లో భాగంగా హైద‌రాబాద్ రీజియన్‌‌లో 66, సికింద్రాబాద్ 126, రంగారెడ్డి 52, న‌ల్గొండ 56, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 83, మెద‌క్ 93, వ‌రంగ‌ల్ 99, ఖ‌మ్మం 53, అదిలాబాద్ 71, నిజామాబాద్ 69, క‌రీంన‌గ‌ర్‌ రీజియన్‌లో 45.. మొత్తంగా 813 కండ‌క్టర్ పోస్టుల‌ను భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.


ఇక ఆర్టీసీ బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా 275 బస్సులు కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×