E-Paper
Advertisement

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్!

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్!
Advertisement

Health Cards: స్వేచ్ఛక బ్యూరో: జూన్ 2 నుంచి డిజిటల్ హెల్త్ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది.ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశంలో ప్రస్తావించారు. ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు, 317 జి ఒ బదిలీలు, ఇతర అంశాలను సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పీఆర్ సీ రిపోర్టును వీలైనంత త్వరలో తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆ దిశలో కమిషన్ కూడా తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.

ఈ సమావేశంలో..

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో, డైరెక్టరేట్ స్థాయిల్లో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు సీఎస్ సూచించారు. ఆధునీక టెక్నాలజీని వినియోగించుకొని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వివిధ సంఘాల నాయకులకు సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో స్సెషల్ సీఎస్ మహేశ్ దత్ ఎక్కా, సవ్యసాచిఘోష్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తు, టిఎన్ జిఒ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టిజిఒ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ లచ్చిరెడ్డి, జనరల్ సెక్రెటరీ రామకృష్ణ, తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులు రాములు, జనరల్ సెక్రెటరీ పాక రమేష్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పెండింగ్ బిల్లుల‌ను వెంట‌నే ఇప్పించండి

Advertisement

ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగుల‌కు ఇచ్చిన ప్ర‌తి హామీని ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ వొడ్నాల రాజ‌శేఖ‌ర్ కోరారు. జూన్ 2కు ముందే 2వ పీఆర్‌సీని అమ‌లు చేయాల‌ని కోరారు. పెండింగ్‌లో ఉన్న అన్ని ర‌కాల బిల్లుల‌తో పాటు స‌మ‌స్య‌ల‌ను సైతం ప‌రిష్క‌రించాల‌న్నారు.ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా నగదు రహిత వైద్యం తక్షణమే అందించాలని కోరారు.రెవెన్యూ శాఖలో 61 సంవత్సరాలకు పైబడిన వీఆర్ఏల చట్టబద్ధ వారసులైన కుమారులు, కుమార్తెలను నియమించాలన్నారు. రెవెన్యూ శాఖలో తొలగించిన 632 కంప్యూటర్ ఆపరేటర్లు మరియు ఎఫ్‌టీఎస్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలన్నారు.

Also read: కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవి ఊడుతుందా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెనుక పెద్ద తలకాయలు?

రెవెన్యూ శాఖలో..

Advertisement

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి హామీ కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంట‌నే విడుదల చేయాలన్నారు. రెవెన్యూ శాఖలో ధరణి ఆపరేటర్ల సేవలను కొనసాగించాలని కోరారు.ఈ సమావేశంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం రాష్ట్ర అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామకృష్ణ‌, తెలంగాణ తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, తెలంగాణ ప్రాంత ఉద్యాయ సంఘం(టీపీయూఎస్‌) రాష్ట్ర అధ్యక్ష‌కార్య‌ద‌ర్శులు హ‌న్మంత‌రావు, డి.భాస్క‌ర్‌, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష‌కార్య‌ద‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, జీపీఓ అసోసియేష‌న్ అధ్యక్షుడు గ‌రిక ఉపేంద‌ర్‌రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

స్టాఫ్​ కౌన్సిల్ మీటింగ్ లో కీలక అంశాలు ఇవే..

1. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం జూన్ 2 నుంచి అమలు చేయనున్నారు. ఉద్యోగుల మూలవేతనంలో 1.5 శాతం చొప్పున వసూలు చేసి, ప్రభుత్వం కూడా సమానమైన మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈహెచ్ ఎస్ అమలు చేయనున్నారు.
2. పీఆర్సీ నివేదికపై త్వరలో తదుపరి సమావేశం జరగనున్నది. పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలో నివేదిక తెప్పించి దానిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.
3.పెండింగ్ బిల్లుల చెల్లింపునకు 100 రోజుల ప్రణాళిక ఫిక్స్ చేశారు. పెండింగ్ బిల్లులను కేవలం 100 రోజులలోపు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటామని సీఎస్ తెలిపారు.4.2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌పై చర్చలు తీసుకోనున్నారు పాత పెన్షన్ అమలుపై ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రితో చర్చించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
5జిల్లా స్థాయిలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
6.ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచించినట్లు వెల్లడించారు.
7.ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచించారు.
8.కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా స్పౌస్ కేటగిరీలో పరిగణించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
9.వారంలో ఐదు రోజుల పని విధానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
10తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరింత నిబద్ధతతో పని చేయాలని కోరారు.
11.ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు టెక్నాలజీపై మరింత అవగాహన పెంచుకుని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

Also read: రవాణా శాఖలో లేడీ బాస్‌ల కష్టాలు.. హైవేల పై లేడీ ఆఫీసర్ల ఆవస్థలు

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×