E-Paper
Advertisement

Rythu Bandhu: ఇక మీదట కొండలు, గుట్టలకు రైతుబంధు బంద్..

Rythu Bandhu: ఇక మీదట కొండలు, గుట్టలకు రైతుబంధు బంద్..
Advertisement

rythu bandhu telangana newsRythu Bandhu Scheme Implementation In Telangana(TS news updates): తెలంగాణలో రైతు బంధు పథకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. గత పాలకులు ఈ పథకాన్ని 5 నెలల పాటు ఇచ్చారని తాము వారికంటే తక్కువ సమయంలోనే ఇస్తున్నామని అన్నారు. ప్రస్థుతం పాత డేటా ప్రకారమే రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు.

శనివారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడూ ఒకటో తారీఖున జీతాలివ్వలేదని, కనీసం మొదటి వారంలో కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపే మార్చి 1వ తేదీన జీతాలిచ్చామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Advertisement

Read More: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్‌సీ ప్రకటించిన ప్రభుత్వం..

ఇక మహిళా సంఘాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని భట్టి స్పష్టం చేశారు. మార్చి 12వ తేదీన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతుబంధు పథకంపై మాట్లాడిన భట్టి.. కొండలు, గుట్టలు, రోడ్లకు ఇక మీదట రైతుబంధు పతకాన్ని బంద్ చేస్తున్నామని స్పష్టం చేశారు.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×