Drinking Water Wastage: హైదరాబాద్ నగరవాసులారా.. పానీ హుషార్. ఎస్.. మీరు విన్నది కరెక్టే.. ఇది పానీ హుషార్. నీటి వాడకంలో ఏ చిన్న తప్పిదం చేసినా.. మీ జేబు ఖాళీ అవుతుంది తస్మాత్ జాగ్రత్త. తాగు నీటిని వృధా చేస్తే.. ఫైన్ల మోత మోగుతుంది బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇదీ వాటర్ బోర్డ్ జారీ చేస్తున్న వాటర్ వార్నింగ్. మంచి నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీగా ఫైన్లు వేసేందుకు సిద్ధమవుతోంది హైదరాబాద్ జలమండలి.
మంచినీటిని వృధా చేస్తే హైదరాబాద్ వాసులపై ఫైన్ల మీద ఫైన్లు వేయాలని ఆలోచిస్తోంది జలమండలి. హైదరాబాద్ లో సమ్మర్ అంటేనే నీటి కొరత భారీగా ఉంటుంది. వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. అందుకే నీటిని ఎంతో జాగ్రత్తగా వాడాలని సూచిస్తున్నారు వాటర్ బోర్డు అధికారులు. హైదరాబాద్ లో నీటి వృధా ఎక్కువగా ఉందని. ఇటీవల జూబ్లీహిల్స్ లో ఒక బైకర్ మంచినీటితో తన బైక్ క్లీన్ చేస్తూ.. కనిపించడంతో.. మరింత అప్రమత్తమయ్యారు అధికారులు. వెంటనే అతడికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. తాము నీటిని అందించేది తాగునీటి అవసరాల కోసం మాత్రమేనని. ఈ నీటితో ఇతర అవసరాలు తీర్చుకుంటే ఒప్పుకునేది లేదంటూ.. తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.. వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి.
బెంగళూరులో నీటిని వృధా చేస్తే 5 వేల వరకూ జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకూ ఇక్కడ యాభై రూపాయలు మాత్రమే జరిమానా విధిస్తూ వచ్చారు. ఇంత తక్కువ మొత్తంలో కాకుండా.. అధిక మొత్తంలో జరిమానా విధిస్తే తప్ప.. నీటి వృధాకు అడ్డుకట్ట వేయలేమన్న నిర్ణయానికి వచ్చారు వాటర్ బోర్డ్ అధికారులు. ఇకపై నీటి వృధాపై సీరియస్ గా వ్యవహరించనుంది హైదరాబాద్ జలమండలి. వాహనాలను కడగటం, రోడ్లు శుభ్ర పరుచుకోవడం, తోట నిర్వహణ కోసం ఈ నీటిని వాడటం, నిర్మాణ పనుల కోసం తాగునీరు వినియోగించుకోవడం.. జరుగుతున్నట్టు గుర్తించడంతో అలెర్ట్ అయ్యారు అధికారులు.
నగరంలో 40 వేల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీటిలో 17 వేలు కూడా పని చేయడం లేదు. హైదరాబాద్ జనాభా 30 శాతం మేర.. పెరిగినా నీటి లభ్యత మాత్రం అలాగే ఉంది. నీటి వృధా తగ్గించడానికి ట్యాంక్ డెప్త్ సెన్సార్లను వాడితే తప్ప.. నీటి వృధా తగ్గేలా లేదు. శాటిలైట్ చిత్రాలు ఎప్పటికప్పుడు ఖచ్చితగా అప్ డేట్ అవుతాయి కాబట్టి.. వాటిని ఉపయోగించి నీటి వృధా కాకుండా చేయవచ్చని చెబుతున్నారు నిపుణులు.
Also Read: ఎమ్మెల్యే కోటా.. ఎమ్మెల్సీ సీట్లు.. 4 వీళ్లకు..1 వాళ్లకు
నీటి వృధా తగ్గిస్తేనే వచ్చే రోజుల్లో మంచినీటి వాడకంలో తలెత్తే ఇబ్బందులు తగ్గుతాయని తెలుస్తోంది. కాబట్టి ఇకపై నీటి వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు జలమండలి అధికారులు. సేవ్ వాటర్- సేవ్ లైవ్స్- సేవ్ ఫ్యూచర్.. అంటూ నినదిస్తోంది హైదరాబాద్ జలమండలి.