BigTV English

TG Govt: తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!

TG Govt: తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!

TG Govt: తెలంగాణలో నిరుద్యోగులకు త్వరలో శుభవార్త రానుందా? 12 వేల పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోందా? జాబితాను అధికారులు సిద్ధం చేశారా? ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏ విభాగంలో ఉద్యోగాలన్నది అసలు ప్రశ్న.


కసరత్తు మొదలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. దాదాపు 12 వేల వరకు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు అధికారుల అంచనా. ఏ విభాగంలో ఎన్నేసి ఖాళీలు ఉన్నాయో ఇప్పటికే జాబితాను అధికారులు రెడీ చేసినట్టు సమాచారం. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారట అధికారులు. ఒక విధంగా తెలంగాణ యువతకు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు.


పోలీస్ శాఖలో నిత్యం ఖాళీలు ఉంటాయి. పదవీ విరమణ ద్వారా అవుతున్న మూడు లేదా నాలుగేళ్లకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తుంది ప్రభుత్వం. దాదాపు రెండు దశాబ్దాల కిందట అప్పటి ప్రభుత్వం దాదాపు 40 వేల పోస్టులను భర్తీ చేయాలని భావించింది. ఒకేసారి అన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యంకాదని, ప్రభుత్వంపై ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుందని భావించింది. అందుకే పలు దఫాలుగా నియామక ప్రక్రియను మొదలుపెట్టింది.

2014లో రాష్ట్రం ఏర్పడటం, ఆపై ప్రభుత్వాలు మారడంతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. కొత్తగా మంజూరైన పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ 2022లో పూర్తి అయ్యింది. తెలంగాణ పోలీసు నియామక మండలి 17 వేల పోస్టులను భర్తీ చేసింది. మూడేళ్ల కిందట చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికైనవారికి గతేడాది రేవంత్‌ రెడ్డి అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు.

ALSO READ: తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు, స్మితా సబర్వాల్‌ మాటేంటి?

జాబితా రెడీనా?

భారీ ఎత్తున పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు రెడీ అవుతున్నారు. నోటిఫికేషన్ వెలువడనున్న జాబితాలో కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు అంతర్గత సమాచారం. అయితే ఈ సంఖ్య పెరిగే అవకాశముందని ఉన్నతాధికారుల మాట. మరి ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తుందా? లేక విడతల వారీగా ఇస్తుందా? అనేది తెలియాల్సివుంది.

నార్మల్‌గా ఉద్యోగ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లు కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏడాది రిటైర్డ్ కాబోయే ఉద్యోగులను గతేడాది మార్చి వరకు కొనసాగారు. ఆ ఖాళీలతో పరిశీలిస్తే భారీ రిక్రూట్‌మెంట్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవరాల్‌గా పరిశీలిస్తే నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు.

Related News

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Jadcherla bakery: కర్రీ పఫ్ తింటుంటే నోటికి మెత్తగా తగిలింది.. ఏంటా అని చూస్తే పాము!

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Big Stories

×