E-Paper
Advertisement

కిడ్నీ పేషెంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!

కిడ్నీ పేషెంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!
Advertisement

Dialysis Centers: రాష్ట్రంలోని కిడ్నీ పేషెంట్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా మరో 79 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కోసెంటర్ లో 5 నుంచి పది మిషన్లు, బెడ్లను సమకూర్చనున్నారు. అంతేగాక ఇప్పటికే అందుబాటులోకి 102 కేంద్రాల్లో మరో 155 కొత్త మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటును స్పీడప్ చేయాలని ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు ఆదేశాలిచ్చింది. అత్యాధునిక వసతులు, వీడియో కాలింగ్, రిపోర్ట్ షేరింగ్ తదితర సౌకర్యాలతో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు డయాలసిస్ కేంద్రాలకు హబ్స్ గా నిమ్స్, గాంధీ, ఉస్మానియా దవాఖాన్లు పనిచేయనున్నాయి.

ఈ హబ్‌లకు అనుసంధానం

ఈ మూడు హాస్పిటళ్లలో ఉండే యూరాలజీ, నెఫ్రాలజీ డాక్టర్లతో డయాలసిస్ పేషెంట్లకు వీడియో కన్సల్టెన్సీ సదుపాయం ఉండనున్నది. జిల్లా కేంద్రాల్లో ఉండే డయాలసిస్ కేంద్రాలు ఈ హబ్ లకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా జిల్లాల్లోని పేషెంట్లకు క్రిటికల్ స్టేజ్‌లో గైడ్ చేసేందుకు హబ్ లోని డాక్టర్లు పనిచేయనున్నారు. అవసరమైతే రిఫరల్ విధానంలో నిమ్స్ కు షిప్ట్ చేసే సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

మారు మూల ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా..

Advertisement

మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని రోగులు డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలోనే సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.అయితే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌ లో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. హైదరాబాద్‌ లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు ప్రధాన హబ్‌ లుగా ఉండి క్లినికల్ పర్యవేక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ వంటి మారుమూల ప్రాంతాలతో సహా మొత్తం 416 కొత్త బెడ్లు ఈ నిర్ణయంతో అందుబాటులోకి రానున్నాయి.దీని వలన పేషెంట్ కు వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రధాన సెంటర్లు నిరంతరాయంగా 4 షిఫ్టుల్లో నడుస్తున్నా వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుంది.

టెండర్ల ప్రక్రియను..

Advertisement

Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్యాండ్ మేళం..స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటేR

దీనివల్ల పేషెంట్ల కండీషన్ కొన్ని సందర్​భాల్లో క్రిటికల్ స్టేజ్ కు వెళ్తున్నది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. టీజీఎంఎస్‌ఐడీసీ ద్వారా కొత్త సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), టీవీవీపీ అధికారులు ఆయా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, తగిన స్థలం కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో డయాలసిస్ పేషెంట్లకు ట్రాన్స్ పోర్టు చిక్కులు తగ్గడంతో పాటు మానసిక సమస్యలు కొంత మేరకు తగ్గుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం జర్నీలు, ఆసుపత్రులలో వెయిటింగ్ పీరియడ్ నేపథ్యంలో డయాలసిస్ పేషెంట్లు మానసికంగా కృంగిపోతున్నారు. తద్వారా లైఫ్​ స్పాన్ కూడా తగ్గుతూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం అంటూ డాక్టర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also read: LFP బ్యాటరీ vs NMC బ్యాటరీ.. ఏ బైక్ కు ఏ బ్యాటరీ బెస్ట్ అంటే?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×