Big Stories

Telangana: మరో 4 రోజులు భారీ వర్షాలు.. తెలంగాణ ఆగమాగం.. ఆరెంజ్ అలర్ట్..

Telangana Latest News(Rain in Hyderabad): శనివారం ఉదయం అతి భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు వాన దంచి కొట్టింది. హైదరాబాద్ నిండా మునిగింది. అనేక కాలనీలు జలమయం అయ్యాయి. వాహనాలు వాన నీటికి కొట్టుకుపోయాయి. ఓ చిన్నారి నాలాలో పడి చనిపోయింది.

- Advertisement -

హైదరాబాద్ అనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. రెండు రోజులుగా అక్కడక్కడా వాన పడుతున్నా.. శనివారం మాత్రం మరింత కురిసింది. సడెన్‌గా ఈ వానలేంట్రా బాబోయ్ అని జనం హైరానా పడుతున్నారు.

- Advertisement -

వర్షాలు అప్పుడే అయిపోలేదట. మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వానలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. శని, ఆదివారాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో శనివారం.. ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఆదివారం భారీ వానలు పడతాయని వెల్లడించింది.

భారీ వర్షాలకు కారణం ఉందంటున్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

వానలతో వాతావరణం చల్లబడటం ఒక్కటే గుడ్‌న్యూస్. ఇన్నాళ్లూ ఎండలతో బేజారైన జనాలు.. తాజాగా కురుస్తున్న వానలకు కాస్త ఊరట చెందుతున్నారు. అయితే, మరీ భారీ వర్షం పడటంతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఇండ్లలోకి నీళ్లు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారి మౌనిక నాలాలో పడి చనిపోవడం అత్యంత దారుణం..బాధాకరం.

నగరంలో అవస్థలు ఇలా ఉంటే.. ఇక జిల్లాల్లో మరింత నష్టం. చేతికొచ్చిన పంట వర్షార్పణం. మామిడి కాయలు రాలిపోతున్నాయి. పంటపొలాల్లో వాన నీరు చేరుతోంది. రైతులకు ఈసారి భారీ నష్టం..కష్టం.

జస్ట్ వాన మాత్రమే కాదు.. బలమైన ఈదురుగాలులు మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. చెట్లు, కరెంట్ స్థంభాలు విరిగిపడుతున్నాయి. రాళ్ల వాన మాదిరి.. వడగళ్లు వాన విరుచుకుపడుతుండటంతో నష్టం మరింత పెరుగుతోంది. మరో నాలుగు రోజులు భారీ వర్షాలని చెబుతుండటంతో.. ఇంకెంత కష్టం చూడాల్సి వస్తుందో. అసలిది ఎండాకాలమా? వానాకాలమా? పోయేకాలమా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News