E-Paper
Advertisement

Dharani Portal: జిల్లాల్లో ధరణి పోర్టల్ పై కోడ్ ఆడిట్.. ఇక అక్రమార్కుల చిట్టా పై సర్కార్ సీరియస్..!

Dharani Portal: జిల్లాల్లో ధరణి పోర్టల్ పై కోడ్ ఆడిట్.. ఇక అక్రమార్కుల చిట్టా పై సర్కార్ సీరియస్..!
Advertisement

Dharani Portal: స్వేఛ్చ బ్యూరో: ధరణిపై కోడ్ ఆడిట్ ను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని జిల్లాల్లో నిర్వహించాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. ధరణిపై పూర్తి స్థాయిలో కోడ్ ఆడిట్ నిర్వహించి ప్రత్యేక రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఈ కోడ్ ఆడిట్ ను నిర్వహించేందుకు రెడీ అయింది. ఈ ఆడిట్ ద్వారా తప్పిదాలు ఎక్కడ జరిగాయి? లావాదేవీలు ఎలా జరగాయి? అనే అంశాలు స్పష్టంగా తేలిపోతాయని అధికారులు చెప్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డకూడా ఉన్నతాధికారులతో రివ్యూనిర్వహించారు. ధరణిలో జరిగిన తప్పిదాలను గుర్తించాలంటే కోడ్ ఆడిట్ ను నిర్వహించాల్సిందేనని ఆయన కూడా నొక్కి చెప్పారు. ఇందుకోసం అవసరమైన వ్యవస్థను సమకూర్చేందుకు సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కోడ్ ఆడిట్ అంటే ఏమిటి? ఎందుకు అవసరం?

​సాధారణంగా జరిగే ఆర్థిక ఆడిట్ కాకుండా, సాఫ్ట్‌వేర్ రాసిన ‘కోడ్’ను నిశితంగా పరిశీలించడమే ఈ కోడ్ ఆడిట్. కంప్యూటర్లు, సాప్ట్ వేర్ ను ఈ కోడ్ ఆడిట్ ల ద్వారా తనిఖీలు చేస్తారు. సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఎక్కడైనా రహస్యంగా డేటాను మార్చే ‘బ్యాక్ డోర్’ మార్గాలు ఉన్నాయా ? అని తనిఖీ చేస్తారు.ఒక లావాదేవీ ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? అనేది రికార్డు కాకుండా కోడ్ మార్చారా అనే కోణంలో విచారణ ఈ కోడ్ ఆడిట్ ద్వారా తెలుసుకుంటారు. అంతేగాక గతంలో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో అసలు కోడ్ ఆడిట్ నిర్వహించలేదన్న విషయం బట్టబయలైంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం పూర్తిస్థాయి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించింది.

Advertisement

Also Read: CM Revanth Reddy: నేడు వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

భూ దోపిడీకి సాఫ్ట్‌వేర్ దారి చూపిందా?

తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో పెను సంచలనం సృష్టించిన ‘ధరణి’ పోర్టల్ ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ ఉచ్చులో చిక్కుకుంది. కేవలం సాంకేతిక లోపాలు మాత్రమే కాదు, వ్యవస్థీకృతమైన ‘కోడ్’ అక్రమాల ద్వారా వేల కోట్ల రూపాయల భూ లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో వెలుగుచూసిన చేదు నిజాలతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోడ్ ఆడిట్ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది.ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి కొట్టారు.అయితే గతంలో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించిన సమయంలో అనేక లోపాలను గుర్తించినప్పటికీ, వాటిని సరిదిద్దకుండానే ‘అంతా బాగుంది’ అని తప్పుడు నివేదిలను ప్రభుత్వానికి ఇచ్చినట్లు సమాచారం.అంతేగాక మ్యాన్యువల్ ఇంట్రవెన్షన్ తో తప్పులు చేసేందుకు అవకాశం ఉండేలా సాప్ట్ వేర్ ను రూపొందించడం వెనక కారణాలను కూడా ఈ కోడ్ ఆడిట్ లో తేలిపోతుంది.

టెర్రాసిస్ టెర్రర్ …

Advertisement

ధరణి నిర్వహణ బాధ్యతను టెర్రాసిస్ అనే సంస్థకు అప్పగించడం వలనే ఈ సమస్య వచ్చినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.ని బంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలను కప్పిపుచ్చేందుకే ఈ తరహా సాఫ్ట్‌వేర్ మేనేజ్‌మెంట్ జరిగినట్లు కోడ్ ఆడిట్ టీమ్ అనుమానిస్తోంది. సర్కార్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో భూ లావాదేవీల సమాచారాన్ని సేకరిస్తున్నారు. తప్పిదాలకు పాల్పడిన అధికారులు, సాఫ్ట్‌వేర్ రూపకర్తలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. “ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తాం” అని ప్రభుత్వం కూడా స్పష్టంగా చెబుతున్నది. కోడ్ ఆడిట్ పూర్తయితే, ఏయే సర్వే నంబర్ల ద్వారా, ఎవరి ప్రయోజనాల కోసం ఈ వెబ్‌సైట్‌ను ఆయుధంగా వాడుకున్నారనేది తేలిపోనున్నది.

Also Read: OTT Thriller Movies : వెన్నులో వణుకుపుట్టించే హారర్ సినిమాలను చూడాలకుంటున్నారా? ఈ వీక్ పండగే..

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×