Satyabhama Today Episode January 20 th : నిన్నటి ఎపిసోడ్ లో… నామినేషన్లో సత్యకు సంతకం సంతకం సంధ్య రాలేదు.. విశ్వనాథం ఫోన్ చేస్తాడు. కానీ సంధ్య మాత్రం నాకు ఇష్టం లేదు.. నేను రాను అక్క మీ మామయ్య నిండు మీద నువ్వు పోటీ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంది.. చివరి నిమిషంలోని ఇలా చెప్తే నేను ఎలా సంధ్యా ని సత్య బాధపడుతుంది అయినా సన్నిమనస్సు కరగదు. సత్య ఫీల్ అవుతుంది క్రిష్ బయటకొచ్చి ఫీల్ అవుతాడు.. సత్య ఏడవడం చూసి అందరూ బాధపడతారు. ఇక జయమ్మ బయటికి వచ్చి క్రిష్ తో నువ్వు సత్యను మోసం చేస్తున్నావని అంటుంది. వెనకుండి శ్రీకృష్ణుడు లాగా నడిపిస్తున్న అనుకున్నాను.. కానీ నువ్వే ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు సత్య ఏడుస్తుంది నాకు చాలా బాధగా ఉందని జయం అంటుంది. క్రిష్ కూడా బాధపడతాడు. అందరూ సత్యని ఓదారుస్తారు. ఇక జయమ్మ లోపలికి వెళ్లి సత్యా నువ్వు 9 మందితోని నామినేషన్స్ వెయ్యు అంటుంది. అలా చేస్తే ఉపయోగము ఉండదు కదా అని హర్ష అంటాడు. 9 మంది వెనుకున్నారని తెలుస్తుంది అని నందిని అంటుంది. సత్య నామినేషన్స్ వెయ్యబోతుంటే రుద్ర నేనున్నాను సంతకం పెట్టడానికి అని ముందుకు వస్తాడు. రుద్ర సంతకం పెట్టడంతో అందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నామినేషన్ కి చివరిదిగా రుద్ర సంతకం పెట్టడానికి ముందుకు వస్తాడు. ఇక ఇంటికి వెళ్ళగానే మహాదేవ భైరవి నువ్వు ఎందుకు సంతకం పెట్టావ్ రా అని అడుగుతారు. రుద్ర అసలు నిజం బయటపెడతాడు. వాడు ఎవడు నాకు వీడియో పంపించాడు. నువ్వు బెదిరించాడు అందుకే సంతకం పెట్టాల్సి వచ్చింది అని అంటాడు ఏం వీడియో రాని మహదేవయ్య అడుగుతాడు. ఆ వీడియోని చూపిస్తాడు ఆ వీడియోని చూసి మహదేవయ్యా బైరవి రేణుక షాక్ అవుతారు. ఆ వీడియో నాకు పంపించరా ఎందుకు బాపు రుద్ర అడుగుతాడు. దానికి మహాదేవయ్య ఆ వీడియోను కోర్టులో సబ్మిట్ చేసి నీకు బెల్ క్యాన్సిల్ చేసి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తానని మహదేవయ్య అంటాడు. ఏదైనా చేసేటప్పుడు తలుపులు వేసుకోవలసిన పని లేదా రా నీకు. నువ్వెందుకురా ఇక జీవితంలో మారవు నువ్వు ఇంతే అనేసి మహాదేవయ్య రుద్రను తిడతాడు. బైరవి రేణుకని అడుగుతుంది ఈ వీడియో నువ్వు తీసావా అని నేను ఎందుకు తీస్తాను అత్తమ్మ నాకేం అవసరం ఉందని రేణుక అంటుంది.
ఇక సంధ్యకు ఇంట్లో చివాట్లు పడతాయి.. సంతకం పెట్టడానికి రానని ముందే చెప్పొచ్చుగా ఎందుకు నువ్వు ఇలా చేశావని విశాలాక్షి అడుగుతుంది. కానీ సంధ్య మాత్రం సరైన సమాధానం చెప్పదు. అక్క వాళ్ళ ఇంట్లో శత్రువు అవడం నాకు ఇష్టం లేదు అందుకే రాలేదు నేను కావాలని రాలేదు అని అంటుంది. అది విని అందరూ షాక్ అవుతారు. ఇలాగ నేను ఒకసారి ఒక మాట ఒకసారి ఇంకొక మాట మాట్లాడను. ఇష్టం లేదు అంతే అని సంధ్య అంటుంది ఇక అందరూ తలా ఒక మాట సంధ్యను అంటారు. నందిని అంటే నందినికి గట్టిగా షాక్ ఇస్తుంది సంధ్య. ఇక అందరూ సంధ్యను తిడతారు. మహదేవయ్యా అసలు రుద్రకి వీడియో ఎవరు పంపారు అని ఆలోచిస్తూ ఉంటారు. సత్య వేడివేడి కాఫీ గొంతులో పడితే ఆలోచనలు రెట్టింపు అవుతాయి తీసుకు రమ్మంటారా అని అడుగుతుంది. ఇల్లలకగానే పండగ కాదు నామినేషన్స్ వేయగానే ఎలక్షన్లలో గెలిచినట్లు కాదు అని మహాదేవయ్య అంటాడు..
ఇక సత్య దగ్గరికి వెళ్తాడు క్రిష్.. మీ అన్నయ్య సంతకం పెట్టడానికి ఏదో అదృశ్య శక్తి నాకోసం సాయం చేసిందని అంటుంది సత్య. అది విన్న క్రిష్ ఇదేంటి నా మీదనే అనుమాన పడుతుంది అని అనుకుంటాడు ఇక సత్య ఇదంతా చేశాడని కృష్ణ నోటివెంటే బయట పెట్టించాలని అనుకుంటుంది. మీద అతనికి ఇంట్రెస్ట్ ఉందేమో అన్నట్టుగా క్రిష్ కి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. ఇక మహదేవయ్య టెన్షన్ పడుతుంటే భైరవి ఆ సత్యం చూస్తే టెన్షన్ పడుతున్నావా అడుగుతుంది. సత్య ని చూసి కాదు సత్య కి 100 ఓట్లు కూడా రావు. ఏం జరుగుతుందో జరుగుతుందన్నట్టు మహదేవ మాట్లాడతాడు. సత్య క్రిష్ దగ్గరికి వచ్చి అదృశ్య శక్తి ఎవరో నాకు తెలిసిపోయింది అని అంటుంది. అతను మెసేజ్ చేస్తాడు ఇప్పుడు కాల్ కూడా చేశాడని కావాలని నందినితో ఫోన్ చేయించి నాటకం ఆడుతుంది. క్రిష్ టెన్షన్ పడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో క్రిష్ సత్యకు నిజం చెప్పబోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..