Polytechnic Reforms: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ సాంకేతిక విద్యా రంగం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. పాలిటెక్నిక్ విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసకువస్తోంది. గ్లోబల్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై పాలిటెక్నిక్ విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, క్షేత్రస్థాయి అనుభవం లభించనుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఏడాది మొత్తం అప్రెంటిస్ షిప్(పరిశ్రమల్లో శిక్షణ) విధానాన్ని తప్పనిసరి చేయనున్నారు. దీనివల్ల చదువు పూర్తి కాగానే విద్యార్థులు నేరుగా ఉద్యోగాలకు ఎంపికయ్యేలా నైపుణ్యం సాధిస్తారు. ఈ నూతన విద్యా విధానాన్ని వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలుచేయనున్నారు.
జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ పరిశ్రమలు, సంస్థలతో ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పాలిటెక్నిక్ లో కొత్తగా 10 అధునాతన కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ఇందులో అత్యంత విశేషం ఏంటంటే.. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని 5 సరికొత్త కోర్సులు ఇందులో ఉన్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) పరిధిలో కూడా ఇప్పటివరకు లేని ఈ 5 కోర్సులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు సాధించడం విశేషం. ఈ మార్పులతో తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ఈ అడుగులు వేస్తోంది.
పాలిటెక్నిక్ లో అందించే 5 కొత్త కోర్సుల్లో.. డిప్లొమా ఇన్ సెమీకండక్టర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అడ్వాన్స్ డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఉన్నాయి. అంతేకాకుండా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్, డిప్లొమా ఇన్ ల్యాండ్ స్కేప్ డిజైన్, డిప్లొమా ఇన్ మల్టీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సులన్నాయి. డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ డేటా అనలెటిక్స్ కోర్సు నిర్వహణ బాధ్యతలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) నిర్వహించడానికి ముందుకొచ్చింది.
Also read: ఇండియన్ రోడ్లపై ఈవీల జోరు.. పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎందుకు బెస్ట్?
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పాలీసెట్), లాటరల్ ఎంట్రీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్పీ సెట్)- 2026 ఫలితాలు రిలీజయ్యాయి. మాసబ్ ట్యాంక్ లోని సాంకేతిక భవన్ లో సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. కాగా పాలిసెట్ లో 82.94 శాతం అర్హత సాధించగా, ఎల్పీ సెట్-2026లో 57.28 శాతం మంది అర్హత సాధించారు. పాలీసెట్ పరీక్షను ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా 293 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. పరీక్షలకు 1,06,439 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98,029 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో81,307 మంది అర్హత సాధించారు.
పరీక్షకు హాజరైన వారిలో 52,201 మంది బాలురు ఉండగా వారిలో 41,719 మంది (79.92 శాతం) అర్హత సాధించారు. బాలికలు 45,829 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 39,588 మంది(86.92 శాతం) అర్హత సాధించారు. లాటరల్ ఎంట్రీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్పీ సెట్) లో 57.28 శాతం మంది అర్హత సాధించారు. ఎల్పీ సెట్ పరీక్ష ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. పరీక్షలకు 522 మంది బాలురు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 491 మంది బాలురు ఉండగా అందులో 281 మంది(57.23 శాతం) అర్హత సాధించారు. బాలికలు 19 మంది దరఖాస్తు చేసుకోగా 17 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 10 మంది(58.82 శాతం) అర్హత సాధించారు. ఈ నెల 27 నుంచి కౌన్సె లింగ్ నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థులు 202-627 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ లో ప్రవేశానికి అనర్హులుగా పరిగణింపబడతారని అధికారులు ప్రకటించారు.
పాలీసెట్-2026 ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 120 మార్కులతో 10 మంది మొదటి ర్యాంకును సాధించారు. నామాల లోకేష్, బానోత్ హేమంత్, అల్వీయా షిఫాలీ, మహ్మద్ మహబూబ్ అర్ఫాజ్ అలీ, కోట్ల అపూర్వ, అన్నం హరి కృష్ణ, జంగాల అవినాష్ అంగద్, చిలక నందవర్ధన్ రెడ్డి, కందూరి ఆదిత్య శౌరీ, రుద్రోజు సాజన్, దూరెడ్డి వన్మయ్ రెడ్డి 10 మంది టాప్-1 ర్యాంకు సాధించారు. ఎంబైపీసీలో కోట్ల అపూర్వ, రుద్రోజు సాజన్ 120 మార్కులతో టాప్-1 ర్యాంక్ ను సాధించారు. కనకాల హేమంత్ రెడ్డి 3వ ర్యాంక్ సాధించగా 4వ ర్యాంక్ ను జక్కు తుషారా, షేక్ ఫర్మాన్ షా ఇద్దరు సొంతం చేసుకున్నారు.
Also Read: గూగుల్ నుంచి బిగ్ లీక్.. Pixel 11లో ఈ ‘పిక్సెల్ గ్లో’ ఫీచర్ చూస్తే ఫ్యూజులు అవుట్!
ఇదిలా ఉండగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అందించే వివిధ డిప్లొమాకోర్సులో ప్రవేశం, కౌన్సెలింగ్ కోసం ప్రత్యేక ప్రవేశ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ అందించే వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం, కౌన్సెలింగ్ కోసం ప్రత్యేక ప్రవేశ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ అందించే వివిధ డిప్లొమా కోర్సులో ప్రవేశం, కౌన్సెలింగ్ కోసం సైతం ప్రత్యేక ప్రవేశ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
రానున్న 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 4200 సీట్లను పెంచుతున్నట్టు సాంకేతిక విద్య శాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 80 శాతం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 100 శాతం సీట్లు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోన్నుట్టు తెలిపారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో వినూత్న మార్పులు చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే జూన్ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం నుంచి పాలిటెక్నిక్ కోర్సుల్లోని సిలబస్ లో భారీ మార్పులు చేసినట్టు తెలిపారు.
సుమారు 30 నుంచి 40 శాతం సిలబస్ ను మార్చరినట్లు వెల్లడించరాఉ. ప్రతి కోర్సు లో 5 రకాల కాంపిటేటివ్ ఎడ్జ్ ఉండేలాగా సిలబస్ ను రూపొందించినట్టు తెలిపారు. పాలిటెక్నిక్ ఇంటర్న్ షిప్, అప్రెంటిషిప్ చేస్తున్న విద్యార్థులకు నెలకు రూ.9వేల స్టెఫండ్ ను అందిస్తున్నట్లు చెప్పారు. నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీం(నాట్స్) నుంచి రూ.7వేలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేసి అందులో నుంచి మరో రూ.2 వేలు స్టెఫండు కలిపి రూ.9 వేలను విద్యార్థులకు అందజేయనున్నారు. ఇతర రాష్ట్రాల్లోని సంసల్లో చేరిన తెలంగాణ విద్యార్థులకు కూడా అప్రెంటిషిప్ కల్పించనున్నట్లు దేవసేన వెల్లడించారు.
Also Read: చెవులకు క్లిప్ పెట్టేసుకోవడమే! శాంసంగ్ నుంచి ఓపెన్ ఇయర్ ఇయర్‌బడ్స్
రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు(ఏటీసీ)గా అభివృద్ధి చేయనున్నట్లు శ్రీదేవసేన వెల్లడించారు. ఇందుకోసం రూ.3వేల కోట్లు ఖర్చుచేయనున్నట్టు వెల్లడించారు. పాలిటెక్నిక్ కాలేజీ లెర్చరర్లకు ఐఐటీ హైదరాబాద్ చేత ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాముల్లో శిక్షణనిప్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కొత్త కోర్సుల బోధనకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ విధానంలో ఇండస్ట్రీ నిపుణుల ఆధ్వర్యంలో పాఠాలు బోధించేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మరమ్మతులతోపాటు రంగులు వేయడానికి రూ.41 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. విద్యార్థులకు మంచి ప్లేస్ మెంట్స్ ను, ఇంటర్న్ షిప్ కల్పించేందుకు పరిశ్రమ వర్గాలతో త్వరలో ఎంవోయూలను చేసుకుంటామని శ్రీదేవసేన స్పష్టంచేశారు. రాష్ట్రంలో డిగ్రీలో 11 కొత్త ఏఈడీపీ కోర్సులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులో చివరి సంవత్సరం మొత్తం ఇంటర్న్ షిప్ ను కొనసాగించనున్నట్టు తెలిపారు. మొదటి విడుత దోస్త్ లో ఏఈడీపీ కోర్సుల్లో 50 శాతం సీట్లు భర్తీ అయినట్టు తెలిపారు.
Also Read: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు, నుజ్జైన ముందు పార్ట్