YS Sharmila: మోదీజీకి దేశమే ప్రథమం అనడం ఈ శతాబ్దపులేనే అతి పెద్ద జోక్ అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. పౌరుడే ప్రథమం అని చెప్పడం తీవ్ర హాస్యాస్పదం అని, “దోపిడీ ఫస్ట్ – నేషన్ నెక్ట్స్ ” .. “ మోదీజి ఫస్ట్ .. సిటిజన్ నెక్ట్స్ “ ఇదే మోడీ గారి 25 ఏళ్ల అధికార రాజకీయ ప్రస్థానానికి అసలైన నినాదం అంటూ వైఎస్ షర్మిలా సెటెర్లు వేసారు.
దేశాన్ని దోచి, అదానీ అంబానీల దగ్గర దాచి, నిర్దిష్ట కార్పొరేట్ సంస్థలకు అన్ని రంగాలను అమ్మేసిన ఘనుడు మెదీ అని అన్నారు. దేశ సంపదను కొద్దిమంది చేతుల్లో పెట్టి, రూపాయి విలువను పతనం చేసాడని అన్నారు. స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను జేబు సంస్థలుగా వాడుకోవడం, ప్రశ్న పత్రాలు లీక్ చేయడమే పాతికేళ్లుగా మోడీ గారు సాధించిన చారిత్రక విజయాలని అన్నారు. మోదీజీ పాలన దేశానికి పట్టిన దౌర్భాగ్యం. 25 ఏళ్ల అధికార ప్రస్థానంలో ఉద్ధరించింది శూన్యం అని షర్మిల ఫైర్ అయ్యారు. నోట్ల రద్దు అతిపెద్ద వైఫల్యంమని, బీజేపీ పాలనలో ఆహార ద్రవ్యోల్బణం 5.49 శాతం పెరిగిందని అన్నారు. రూపాయి విలువ డాలర్ తో పోల్చితే గరిష్టంగా పతనం జరిగింది.
Also read: బిగ్ బ్రేకింగ్.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం!
ఉద్యోగాలు లేక నిరుద్యోగం 15 శాతం అధికంగా పెరిగిందని, ఇంధనపు ధరలు 120 శాతం అదనంగా పెరగగా.. ఏడాదికి 10 వేల మంది రైతుల బలవన్మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదని, మాట్లాడుకుంటూ పోతే ముగింపే ఉండదు అన్నట్లుంటుంది మోదీ గారు చేసిన మోసాల జాబితా అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.