Telangana RTC: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడానికి స్మార్ట్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం విద్యార్థుల బస్ పాస్‌లను స్మార్ట్‌కార్డులుగా మార్చే ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లుడించింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, మహాలక్ష్మి పథకంలో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు కూడా స్మార్ట్‌కార్డులు జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేసిన స్మార్ట్‌కార్డ్ విధానాలను పరిశీలించి, తెలంగాణకు అనుకూలంగా ఉండే విధంగా కొత్త విధానం రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రీఛార్జ్, రీన్యూవల్ ఇప్పుడు మొబైల్ ద్వారా
ప్రస్తుతం బస్‌పాస్ రీన్యూవల్ చేయాలంటే, ప్రయాణికులు కౌంటర్ల వద్దకు వెళ్లి లైన్ లో నిలబడి మాన్యువల్ గా ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ స్మార్ట్‌కార్డులు ప్రవేశపెట్టబడితే, రీఛార్జ్ చేయడం లేదా రీన్యూవల్ చేసుకోవడం మోబైల్ ఫోన్ల ద్వారా సులభం అవుతుంది. మహాలక్ష్మి పథకంలో మహిళలు ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం ఉండదు, కేవలం స్మార్ట్‌కార్డును చూపించి వారు సౌకర్యంగా ప్రయాణించగలరు. ఈ విధానం, ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తూ, సౌకర్యాన్ని పెంచేలా రూపొందించబడింది.
Also Read: Indigo Flight: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 180 మందికి పైగా ప్రయాణికులు
రూట్ డేటా సేకరణతో ఆర్టీసీకి లాభం
స్మార్ట్‌కార్డుల ద్వారా ఆర్టీసీకి కూడా అనేక లాభాలు ఉన్నాయి. ఏ రూట్‌లో ఎంతమంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు, ఎవరెవరు ఎన్ని సార్లు బస్సు ఎక్కారు వంటి డేటాను సులభంగా సేకరించడం సాధ్యం అవుతుంది. ఈ సమాచారం ఆధారంగా రూట్లను సక్రమంగా నిర్వహించడం, రద్దీగా ఉండే మార్గాల్లో అదనపు బస్సులు ఏర్పాటు చేయడం సులభం అవుతుంది. దీనివల్ల ప్రయాణికులకు మరింత సమయం కలిరావడమే కాకుండా, సౌకర్యంగా బస్ సేవలు అందించవచ్చు.
ఇతర రాష్ట్రాల్లో విజయవంతం
ప్రస్తుతం స్మార్ట్‌కార్డ్ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. ఆ విధానంలో ప్రయాణికులు రీపీట్ పాస్‌లు, రీఛార్జ్, ట్రాన్సాక్షన్లను సులభంగా చేస్తున్నారు. తెలంగాణలో కూడా ఈ విధానం ప్రారంభమైన వెంటనే, ప్రయాణికులు దాని సౌకర్యాలను నేరుగా అనుభవించే అదృష్టం కలుగుతుంది. విద్యార్థులు, మహిళలు, సాధారణ ప్రయాణికులు అందరు సౌకర్యంగా బస్సు ప్రయాణం చేయనున్నారు.
స్మార్ట్‌కార్డుల వ్యవస్థ ప్రవేశపెట్టడం తెలంగాణ ఆర్టీసీకి మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి ప్రయాణికుడికి కొత్త అనుభవాన్ని అందించనుంది. ఈ కొత్త విధానం, అందరికీ ఆధునిక, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని అధికారులు పేర్కొన్నారు. స్మార్ట్‌కార్డుల ప్రవేశంతో ప్రయాణం మరింత సులభం అవుతుంది. ఈ మార్పులు విద్యార్థులు, మహిళలు, సాధారణ ప్రయాణికుల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేలా అమలుకానుంది.