BigTV English

Modi – Trump: దెబ్బకు దెయ్యం దిగింది.. స్వరం మార్చిన ట్రంప్ – అభినందించిన మోదీ

Modi – Trump: దెబ్బకు దెయ్యం దిగింది.. స్వరం మార్చిన ట్రంప్ – అభినందించిన మోదీ

టారిఫ్ ల పేరుతో భారత్ ని టార్గెట్ చేయాలని చూసింది అమెరికా. రష్యాకు దూరం చేసి, చమురు కొనుగోళ్లను నిలిపివేసి భారత్ ని తన చేతిలో కీలుబొమ్మగా మార్చుకోవాలనుకుంది. కానీ భారత్ ముందు ఆ పాచికలు పారలేదు. అమెరికా టారిఫ్ లను ఏమాత్రం లెక్క చేయకుండా రష్యాతో మరింత బలమైన వాణిజ్య బంధాలను కోరుకుంది భారత్. అదే సమయంలో చిరకాల శత్రువైన చైనాకు కూడా దగ్గరయ్యేందుకు సాహసించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోదీ ఇటీవల చైనాలోని షాంఘైలో కలిశారు. ఈ భేటీ ప్రపంచ దేశాలన్నిటినీ ఆకర్షించింది. ఈ త్రయాన్ని చూసి అమెరికా మరింతగా కుళ్లుకుంది. అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యా, భారత్ జట్టు కడితే మొదటికే మోసం వస్తుందని గ్రహించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా భారత ప్రధాని మోదీని పొగుడుతూ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ లో ఓ పోస్ట్ పెట్టాడు.


ట్రంప్ ఏమన్నారు..?
భారత్‌, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని అన్నారు ట్రంప్. దానిపై ఎలాంటి ఆందోళన లేదని, రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటానని, మోదీ గొప్ప ప్రధాన మంత్రి అని కితాబిచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న పనులు తనకు నచ్చడం లేదన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రధాని మోదీ స్పందించడం విశేషం.

మోదీ స్పందన ఇదే..
ఇరు దేశాల సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భావాలను, ఆయన సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు మోదీ. భారత్‌, అమెరికా మంచి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని, భవిష్యత్తులో కూడా ఈ భాగస్వామ్యం కొనసాగుతుందనే అర్థంలో ఆయన ట్వీట్ వేశారు. తనను గొప్ప ప్రధానిగా ట్రంప్ అభివర్ణించడంపై మాత్రం మోదీ సూటిగా స్పందించలేదు. ట్రంప్ ని ఇరుకున పెట్టేందుకు రష్యా, చైనాతో సన్నిహితంగా మెలిగిన మోదీ తన పాచిక పారిందని మాత్రం లోలోపల సంతోషపడుతున్నట్టు తెలుస్తోంది.


https://twitter.com/narendramodi/status/1964180697012228163z

ట్రంప్ విలవిల..
సుంకాలు పెంచితే భారత్ తనముందు సాగిలపడుతుందని అంచనా వేశారు ట్రంప్. కానీ దానికి విరుగుడుగా భారత్ జీఎస్టీ సంస్కరణలు తెచ్చింది. ఎగుమతిదారులకోసం మరో పాలసీ తీసుకొస్తోంది. ఈ దశలో అమెరికాను కాదని ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోడానికి సిద్ధపడింది. అటు ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా అమెరికా టారిఫ్ లను వ్యతిరేకిస్తూ భారత్ కి స్నేహహస్తం ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. దీంతో ట్రంప్ డైలమాలో పడ్డారు. ఇటీవల భారత ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. భారత్-చైనా-రష్యా మైత్రితో ట్రంప్ మరింత కంగారు పడుతున్నారు. అందుకే మోదీని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయన గొప్ప ప్రధాని అని, ఆయనతో తనకు స్నేహం ఉందంటున్నారు. భారత్ మరింత బెట్టు చేస్తే.. టారిఫ్ ల విషయంలో ట్రంప్ తనకు తాను వెనక్కు తగ్గే అవకాశాలు స్ఫష్టంగా కనపడుతున్నాయి.

Related News

Samajwadi Leader: పరుపు చాటున దాక్కున్న నాయకుడు.. బెడ్ రూమ్ నుంచి లాక్కొచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు

Indigo Flight: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 180 మందికి పైగా ప్రయాణికులు

Lunar Eclipse 2025: 3 ఏళ్ల తర్వాత అతి పెద్ద చంద్రగ్రహణం.. ఇండియాలో ఎప్పుడు కనిపిస్తుంది ?

Bihar Bidi: బీహారీల బీడీ.. ఆ పోలికతో చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్.. అసలే ఎన్నికల సమయం!

GST Reforms: వన్ నేషన్ – వన్ ట్యాక్స్ అందుకే సాధ్యం కాదు -నిర్మలా సీతారామన్

Big Stories

×