E-Paper
Advertisement

జూలై 1 నుంచి ఉపాధి హామీ బంద్.. కేంద్రం తెస్తున్న కొత్త చట్టం వెనుక అసలు కథ ఇదేనా?

జూలై 1 నుంచి ఉపాధి హామీ బంద్.. కేంద్రం తెస్తున్న కొత్త చట్టం వెనుక అసలు కథ ఇదేనా?
Advertisement

MGNREGS Works: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రి సీతక్క వ‌రుసగా సమీక్షలు జరుపుతుండటంతో కూలీల హాజరు శాతం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 16లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఈనెల ప్రారంభంలో ఎండలు మండిపోవటం, సాంకేతిక సమస్యలు, మొబైల్ ఫోటో క్యాప్చరింగ్ ఇబ్బందులతో కూలీలు ఉపాధీ పనులకు రావటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా రోజుకు లక్ష మంది కూలీలు కూడా పనులకు రావడం కష్టంగా మారింది. అయితే మంత్రి సీతక్క వరుస సమీక్షలు, అధికారుల ప్రత్యేక డ్రైవ్‌తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

నల్గొండ జిల్లాలో..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు కనీసం 16 లక్షల మంది కూలీలు ఉపాధీ హామీ పనులకు హాజరవుతున్నారు. మే మొదటి వారంలో 7 లక్షల వరకు ఉన్న హాజరు క్రమంగా పెరిగి ఇప్పుడు 16.24 లక్షలకు చేరుకోవటం గమనార్హం. కూలీల హాజరు తక్కువగా ఉన్న జిల్లాలు, మండలాలను గుర్తించి అధికారులతో సమావేశాలు జరపటంతోపాటు గ్రామాల వారీగా ఇన్​ ఛార్జ్​ లను నియమించటంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ వికార్‌బాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాలు మంచి పురోగతి సాధించాయి. నల్గొండ జిల్లాలో ప్రతి రోజు ఏకంగా 1.23 లక్షల మందికి పైగా కూలీలు పనులకు హాజరవుతుండటం గమనార్హం. కూలీల సంఖ్య కాస్త తక్కువగా ఉంటున్న గద్వాల్, రంగారెడ్డి, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కూలీల హాజరు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

పని అడిగిన ప్రతీ కుటుంబానికి..

Advertisement

పని అడిగిన ప్రతి కుటుంబానికి పని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఏ గ్రామంలోనూ పని లేకుండా ఉండకూడదన్నారు. అందుకే అధికారులను ప్రతిరోజూ సమీక్షిస్తూ కూలీల హాజరు పెంచుతున్నామని వివరించారు. ఇక, పెండింగ్ బకాయిల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. మంత్రి సీతక్క కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో మాట్లాడి నిధుల విడుదలకు కృషి చేయడంతో ప్రస్తుతం వేతనాల సమస్యలు లేకుండా పనులు కొనసాగుతున్నాయి.

Also read: ఆరేళ్ల చిన్నారిపై దారుణం.. సంచలన తీర్పిచ్చిన కోర్టు..!

వీటికే అధిక ప్రాధాన్యత..

Advertisement

ప్రస్తుతం ఉపాధి హామీ పనుల్లో భూగర్భ జలాలను పెంచే పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చెరువులు, ఊటకుంటలు, పంటకాలువల్లో పూడికతీత పనులు చేపట్టి వచ్చే వర్షపు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రతి గ్రామంలో కనీసం మూడు నీటి సంరక్షణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో నీటి సంరక్షణ పనులు పల్లెల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ రోజు చేస్తున్న ఉపాధీ పనులు రేపటి తెలంగాణకు నీటి భద్రత కల్పించాలని మంత్రి సీతక్క చెబుతున్నారు. చెరువులు నిండితే రైతు బలపడతాడు.. భూగర్భ జలాలు పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుందన్నారు.

రోజుకు సగటున 16 లక్షల మంది..

జులై 1 నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం స్థానంలో కొత్త విధానం అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించిన 8 కోట్ల పని దినాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 4.5 కోట్ల పని దినాలు పూర్తయ్యాయి. ఇంకా 3.5 కోట్ల పని దినాలను పూర్తి చేయాల్సి ఉంది. రోజుకు సగటున 16 లక్షల మంది కూలీలు పనులకు హాజరైతే నిర్దేశించిన లక్ష్యాన్ని సమయానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రతిరోజూ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, ఎంపీడీఓలతో పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు.

Also read: ఎండలు మండిపోతున్నా నో వర్రీ.. మెడలో వేసుకుని స్మార్ట్ ACని తెచ్చిన సోనీ.. రేట్ ఎంతంటే?

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×