BigTV English

Telangana: వారెవా సచివాలయం.. లోపలంతా హైఫై డిజైన్.. స్పెషల్ వీడియో..

Telangana: వారెవా సచివాలయం.. లోపలంతా హైఫై డిజైన్.. స్పెషల్ వీడియో..

Telangana: మీరీ మధ్య ట్యాంక్‌బండ్ సైడ్ వెళ్లారా? ఎన్టీఆర్ ఘాట్, ప్రసాద్ ఐమ్యాక్స్, నెక్లెస్ రోడ్.. ఇలా హుస్సేన్ సాగర్ చుట్టూపక్కల తిరిగారా? మీరు గనుక అటువైపు వెళ్లి ఉంటే.. మీ దృష్టి అంతా ఓవైపే ఉండి ఉంటుంది. అంతెత్తులో.. నిటారు కట్టడం మన కనులను దోచేస్తుంది. తెలంగాణ దర్పం రొమ్ము విరుచుకుని ఠీవీగా నిలబడినట్టు.. రాజ ప్రాకారం లాంటి ఘనమైన కట్టడం అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అదే మన తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం.


ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభించనున్నారు. ఉదయం 6 గంటలకు వైదిక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సరిగ్గా మధ్యాహ్నం గం.1:20 ని.లకు సీఎం కేసీఆర్ తన ఛాంబర్‌లోని కుర్చీలో ఆసీనులవుతారు. ఆ తర్వాత మంత్రులు తమ తమ ఛాంబర్లలో కొలువుదీరుతారు.

సచివాలయ నమూనాకు సంబంధించి ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని ఓ వీడియోను రిలీజ్ చేశారు. అత్యంత సుందరంగా నిర్మించారు తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్‌ని. సాగర తీరంలో.. పచ్చక బయళ్ల మధ్యలో.. ప్యాలెస్ లాంటి సచివాలయ బిల్డింగ్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నిజాం శైలిలో కట్టిన ఈ కట్టడం.. బయటినుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది.


భవనం చుట్టూ నలువైపులా విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లతో అలరారుతోంది.

గుడి, చర్చ, మసీదు.. సచివాలయ ప్రాంగణంలో నిర్మించారు.

సచివాలయం లోపల మరింత ఘనంగా ఉంది. మొత్తం లగ్జరీ అరేంజ్మెంట్స్.

సచివాలయ ప్రధాన ద్వారమే అట్టహాసంగా ఏర్పాటు చేశారు.

కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్ విశాలంగా.. రిచ్ లుక్‌తో ఘనంగా ఉంది.

మీటింగ్ హాల్.. డిన్నర్ హాల్‌లు హైటెక్‌గా నిర్మించారు.

పెద్ద డోమ్.. మధ్యలో పెద్ద షాండ్లియర్.. అంతా రాజదర్పం ఉట్టిపడేలా ఉంది.

Rain: అలర్ట్.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం..

Rajamouly: జక్కన్నకే ‘ఆస్కార్’.. ది మాస్టర్ మైండ్.. అంతకుమించి..

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×