Telangana Tet Results: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ (Teacher Eligibility Test) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది నిర్వహించిన టెట్ పరీక్షలో అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 33.98% గా నమోదైంది. మొత్తం 90,205 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, అందులో 30,649 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఆన్ లైన్ లో నేరుగా విడుదల చేశారు.
ఫలితాల విషయాల్లో ముఖ్యాంశాలు:
మొత్తం హాజరైన అభ్యర్థులు: 90,205
ఉత్తీర్ణుల సంఖ్య: 30,649
ఉత్తీర్ణత శాతం: 33.98%
ఈ ఫలితాలు జూలై 22 ఉదయం అధికారికంగా విడుదలయ్యాయి. టెట్ ఫలితాల ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా.. పలు విద్యార్థి సంఘాలు, అభ్యర్థులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ముందుగా హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయండి..
ఆ తర్వాత పేపర్ ను ఎంచుకోండి..
పుట్టిన తేదీని ఎంటర్ చేయండి..
ఆ తర్వాత ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి.
భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్స్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..
టెట్‌కు అనూహ్య స్పందన
ఈసారి టెట్ పరీక్షకు ఆశించినదాని కంటే ఎక్కువ మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
విభాగాలవారీగా విశ్లేషణ
పేపర్ 1 పరీక్షకు 47,224 మంది హాజరైతే.. 29,043 మంది పాస్ అయ్యారు. పేపర్ 2 లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ లో 48,998 మంది పరీక్ష రాస్తే 17,574 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 లోని సోషల్ స్టడీస్ లో 41,207 మంది ఎగ్జామ్ రాస్తే 13,075 మంది ఉత్తీర్ణులయ్యారు.
విద్యాశాఖ అధికారుల ప్రకటన
టెట్ ఫలితాల విడుదల సందర్భంగా.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, పరీక్షను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామన్నారు. టెట్ ఫలితాల ప్రకటనలో ఎలాంటి గందరగోళం లేకుండా, అభ్యర్థులు వారి హాల్ టికెట్ నంబర్ ద్వారా.. అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు.
Also Read: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్..
తదుపరి దశల ప్రక్రియ
టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇప్పుడు డీఎస్సీ DSC పరీక్షకు అర్హత లభిస్తుంది. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఇప్పుడు తమ ప్రిపరేషన్‌ను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.