BigTV English

Telangana two cabinet berths: మోదీ కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరికే ఛాన్స్?

Telangana two cabinet berths: మోదీ కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరికే ఛాన్స్?

Telangana two cabinet berths(TS today news): ప్రధాని నరేంద్రమోదీ తన మంత్రి‌ వర్గంపై ఫోకస్ పెట్టారు. ఏ రాష్ట్రానికి ఎన్నేసి పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నారు. అన్నింటికంటే ముందుగా తెలంగాణ విషయాని కొద్దాం. మెజార్టీ తగ్గిన నేపథ్యంలో ఈసారి తెలంగాణకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది.


తెలంగాణ నుంచి ఇద్దరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నారట ప్రధాని నరేంద్రమోదీ. వారికి  సహాయ మంత్రులు ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రేసులో మాజీ మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ లాంటి నేతలు పోటీ పడుతున్నారు.

వీళ్లలో ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈసారి బండి సంజయ్‌కి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట బీజేపీ హైకమాండ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్‌ని తప్పించి అధ్యక్ష పదవి బాధ్యతలను కిషన్‌రెడ్డికి అప్పగించారు. ఆ సమయంలో బండి సంజయ్‌కి ప్రధాని నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.


ALSO READ: రాష్ట్రంలో తెలంగాణ తల్లి ఉత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..?

ఇకపోతే మరొకరు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అందులో కిషన్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటెల రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నరేంద్రమోదీ- అమిత్ షాలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఏపీకి ఐదారు డిమాండ్ చేస్తున్నట్లు నేపథ్యంలో కనీసం తెలంగాణకు రెండైనా కేటాయిస్తే బాగుంటుందని కమలనాధుల ఆలోచనగా చెబుతున్నారు. కేబినెట్ మంత్రులపై శుక్రవారం సాయంత్రం నాటికి ఓ కొలిక్కి రావచ్చని అంటున్నారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×