VIP Security: ఇన్నాళ్లూ ఉన్న భద్రత ఇప్పుడు ఏమైంది? బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వెనక్కు తీసుకున్నారు ఎందుకు?. ప్రస్తుత డీజీపీతో సహా ఎందరో రాజకీయ పోలీసు ప్రముఖులకు గతంలో ఉన్న సెక్యూరిటీ గతంలో ఉన్నట్టు లేదు. కారణాలు ఏమై ఉండొచ్చు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారు కోర్టుకు ఎక్కారు రీజనేంటి? అసలేంటీ భద్రతా వివాదం? దీనికీ ఆపరేషన్ కగార్ కీ ఉన్న లింకేంటి? దేశంలో ఇక మావోయిస్టులు లేరన్న నిర్ణయానికి రావడం వల్లే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టు మీరు భావిస్తున్నారా? గ్రౌండ్ లెవల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? తాజా పరిణామ క్రమాలు మనకేం చెబుతున్నాయి? ఈ సెక్యూరీటి ఇంతలా తగ్గించడం వల్ల మన రాష్ట్రానికి తగ్గే ఆర్ధిక భారమెంత?
మరో కొత్త నిర్ణయం
ఆ DATE నుంచి దేశంలో ఇక మావోయిజం లేదన్న మాట వెలుగు చూసింది. దీంతో ఈ కొత్త నిర్ణయం వెలువడింది. ఇకపై మావోయిస్టుల బెడద పోలీసు ఉన్నతాధికారులకు ఉండదని తేలడంతో.. పోలీస్ బాసులు, ఇతర రాజకీయ నాయకులకు అందించే భద్రతను కుదించాలన్న ప్రతిపాదన చేసింది భద్రతా సమీక్షా సమావేశం. దీంతో వీరి భద్రతను తగ్గించడం మాత్రమే కాదు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సైతం వెనక్కు తీసుకున్నారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం
అందులో భాగంగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెనక్కు ఇచ్చేశారు. అంతే కాదు సర్వీసులో ఉన్న మరో ఆరుగురు సీనీయర్ ఐపీఎస్ లు కూడా DGP సీవీ ఆనంద్ బాటలో నడిచారు. వారెవరంటే, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ సీపీ సజ్జనార్, మహేశ్ భగవత్ తో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ లు తమ వాహనాలు తిరిగిచ్చేశారు. వీరితో పాటు మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ లు వాడుతున్న మరో 20 వరకూ వాహనాలు సైతం రిటన్ బ్యాక్ అయ్యాయి.
Also Read: తప్పు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి జూపల్లి
2 ప్లస్ 2 గన్ మెన్ సెక్యూరిటీ
వీరికున్న 2 ప్లస్ 2 గన్ మెన్ సెక్యూరిటీని వన్ ప్లస్ వన్ కి మార్చారు. మాజీ డీజీపీలు స్వర్ణజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతీ, దినేష్ రెడ్డి, జితేందర్, అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి వంటి వారికి కూడా భద్రత కుదించారు. ఇక మాజీ ఐపీఎస్ లు పూర్ణచంద్రరావు, కొత్తకోట శ్రీనివాసరెడ్డి, నవీన్ చంద్, వెంకటరామిరెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డీటీ నాయక్, ఉమేష్ షరాఫ్, రవిగుప్తా తదితరుల దగ్గరున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా వెనక్కు తీసుకున్నారు.
ట్రాఫిక్ కి ఫస్ట్ ప్రయారిటీ
కేవలం పోలీసు అధికారులే కాదు.. జిల్లా స్థాయిలోని ప్రజా ప్రతినిథుల భద్రత సైతం సరిగ్గా ఇలాగే కుదించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నాయకుల గన్ మెన్ల సంఖ్య బాగా తగ్గించారు. ఈ సిబ్బందిని ఇతర విభాగాల్లో వినియోగించాలని భావిస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా పని చేసిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ లోని సగానికి పైగా సిబ్బందిని ఇతర విభాగాలకు షిఫ్ట్ చేస్తున్నారు. సిబ్బంది కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతోన్న ట్రాఫిక్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాత ఈగల్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లోకి ఎక్కువ మందిని పంపుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సిబ్బంది సర్దుబాటుపై ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలిచ్చారు. దీంతో డిపార్ట్ మెంట్ లో సర్దుబాటు- దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు కనిపిస్తోంది. వందలాది మంది వీఐపీలకు, రిటైర్డ్ అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఇంధనం, ఎస్కార్ట్ సిబ్బందిని కేటాయించడం వల్ల ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం పరిపాలనా పరమైనదే అయినప్పటికీ, దీని చుట్టూ రాజకీయ దుమారం కూడా చెలరేగుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు గత 20 ఏళ్లుగా ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే, దీనిపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని వాదించడంతో.. హైకోర్టు స్పందించింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రస్తుతానికి వెనక్కి తీసుకోవద్దంటూ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!
కీలక నేతలు టార్గెట్
కేవలం భద్రతా సమీక్షే అయితే పర్లేదు కానీ, విపక్ష పార్టీల్లోని కీలక నేతలను టార్గెట్ చేస్తూ, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గన్‌మెన్లను, సెక్యూరిటీని కుదిస్తోందని మండిపడుతోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ముప్పు లేని చోట భద్రత పేరిట ప్రజాధనం వృధా కాకూడదనేది ప్రభుత్వ వాదన కాగా.. కక్షసాధింపులో భాగమే ఇదంతా అనేది విపక్షాల ఆరోపణ. రాబోయే రోజుల్లో ఈ సెక్యూరిటీ విత్‌డ్రా అంశం మరింత రాజకీయ వేడిని రగిల్చేలా కనిపిస్తోంది.
రూ. 35 కోట్ల వ్వవహారం
ఇదంతా ఇలాగుంటే మళ్లీ మనం మాట్లాడుకుందామని అనుకున్నాం గుర్తుందా? ఆ 35 కోట్ల రూపాయల వ్యవహారం మరేదో కాదు. అది ఇదే. భద్రతా సిబ్బందిని భారీగా తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.25 కోట్ల నుంచి 35 కోట్ల వరకూ తగ్గవచ్చన్నది ఒక అంచనా. ఇందులో పెట్రో, డీజిల్ ఖర్చులు, ఆపై భద్రతా సిబ్బంది జీతాలు వగైరా వగైరా.. ఉన్నాయ్. ఇప్పుడు అర్ధమైందా? మావోయిస్టుల లొంగుబాటు సమయంలో వన్ టైమ్ సెటిల్మెంట్లు ఎందుకిచ్చాచ్చారో.