BigTV English

Telangana Weather Update : తడిసి ముద్దైన తెలంగాణ.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Weather Update : తడిసి ముద్దైన తెలంగాణ.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Weather Update : ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఇప్పటివరకూ కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు నిండి.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలకు రోడ్లు కొట్టుకుపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చింతల మానేపల్లి మండలం దీందా వాగు ఉప్పంగి ప్రవహిస్తుంది. దీంతో దిందా, నాయకపు గూడా, శివ పెల్లి గ్రామాలు.. రాకపోకలు నిలిచిపోవడంతో జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. అయినప్పటికీ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వాగు దాటుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

కుమ్రంబీమ్, మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నదిలో భారీగా వరదనీరు పెరుగుతుండగా.. తుమ్మిడి హట్టి వద్ద ప్రమాదకర స్థాయికి చేరినట్టు సమాచారం అందుతోంది. వరద నీటికి పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. కౌటల, చింతలమానేపల్లి, పెంచికల్ పేట, కోటపల్లి.. వేమనపల్లి పరివాహక మండలాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.


ఇక నిన్న ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లో మాత్రం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం వేంపల్లెలో 13.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో 9.6 సెంటీమీటర్లు, రాయ్కల్ లో 8.2 సెంటీమీటర్లు, ఖానాపూర్ లో 8సెంటీమీటర్లు, ముప్కాల్ లో 7.8సెంటీమీటర్లు, సర్వాయిపేటలో 7.6 సెంటీమీటర్లు, కోరుట్లలో 7.6 సెంటీమీటర్లు, కమ్మర్ పల్లిలో 7.3 సెంటీమీటర్లు, బాల్కొండలో 7.3 సెంటీమీటర్లు, లింగాపూర్ లో 7.3 సెంటీమీటర్లు, కొండాపూర్ లో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read : తగ్గిన వర్షాలు.. పెరిగిన వరదలు..

భద్రాచలం వద్ద గోదావరి వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఈరోజు ఇంకొన్ని అడుగుల నీటిమట్టం పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అలానే ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరునాగారం వద్ద కూడా గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జంపన్న వాగు పొంగిపొర్లుతుండడంతో ఎలిశెట్టిపల్లి, కొండాయి, మల్యాల గ్రామాల మధ్య పడవలతో రవాణా కొనసాగిస్తున్నారు.

పశ్చిమ- మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా- ఛత్తీస్‌గఢ్‌ల వైపు వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న ఈరోజు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్.. మెదక్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్.. సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.

భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండడంతో.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. రెవెన్యూశాఖ పరిధిలో అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Related News

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Big Stories

×