Prabhas Remuneration: ప్యాన్ ఇండియా స్టార్‌గా ట్యాగ్ సంపాదించుకున్న తర్వాత ఆ హీరోలతో సినిమాలు చేయాలని ప్రతీ ఒక్క నిర్మాణ సంస్థ ఎదురుచూస్తుంటుంది. ఎందుకంటే అలాంటి హీరోల మార్కెట్ పెద్దగా ఉంటుంది. పైగా వారితో సినిమాలు చేస్తే తమ మార్కెట్ కూడా పెరుగుతుంది అనుకుంటారు నిర్మాతలు. పెట్టుబడి ఎక్కువగా ఉంటే అదే రేంజ్‌లో లాభాలు కూడా వస్తాయి. అందుకే ఒక శాండిల్‌వుడ్ బడా నిర్మాణ సంస్థ ప్రభాస్ వెంటపడింది. మొత్తానికి మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది. అయితే ప్రభాస్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఈ మూడు చిత్రాల అగ్రిమెంట్ కోసం ఏకంగా వందల్లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్టు సమాచారం.
భారీ ప్లాన్
శాండిల్‌వుడ్‌ను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ అయితే తనకు అలాంటి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ లాంటి సినిమాలను నిర్మించడంతో హోంబలే ఫిల్మ్స్‌కు లాభాలతో పాటు ఫేమ్ కూడా బాగానే వచ్చింది. అందుకే తమ నిర్మాణ సంస్థను అన్ని భాషల్లో పాపులర్ చేయడం కోసం కన్నడ కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టింది హోంబేల్ ఫిల్మ్స్. ఇప్పటికే మలయాళ, తమిళ ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ 1’తో టాలీవుడ్‌లో కూడా తన అడుగుపడేలా చేసింది. ఇప్పుడు ప్రభాస్‌తోనే టాలీవుడ్‌ను ఏలేయాలని ప్లాన్ చేసింది ఈ నిర్మాణ సంస్థ.
Also Read: పుష్ప గాడు అంటే తగ్గేదేలే.. ఐటమ్ సాంగ్ కే 8 కోట్లు..?
ఊహించని రెమ్యునరేషన్
ఇప్పటికే ప్రభాస్ (Prabhas), హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) కాంబినేషన్‌లో ‘సలార్ 1’ విడుదలయ్యింది. ‘సలార్ 2’ కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ రెండు కాకుండా మరో మూడు సినిమాలు తమ నిర్మాణంలోనే నటించాలని ప్రభాస్‌తో అగ్రిమెంట్ చేసుకుందట హోంబలే ఫిల్మ్. దానికోసం ప్రభాస్ ఏకంగా రూ.600 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. అంటే ఒక్క సినిమాకు రూ.200 కోట్లను రెమ్యునరేషన్‌గా అందుకుంటున్నాడట. అసలు ఒక హీరో ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటాడా అని ప్రేక్షకులు ఊహించడం కూడా కష్టమేనేమో. ఇప్పుడు ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి విన్న ప్రేక్షకులంతా షాక్ అవ్వక తప్పడం లేదు.
వెరీ బిజీ
ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల విషయానికొస్తే.. ప్యాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత కాస్త స్పీడ్ తగ్గించిన తను.. ఇప్పుడు ఆ గ్యాప్‌ను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ ఏడాదిలో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వచ్చే ఏడాది మొదట్లోనే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ను విడుదల చేయాలని ప్లాన్ చేసినా అది అయ్యేలా లేదు. ఏకంగా 2025 సమ్మర్‌కు ‘రాజా సాబ్’ విడుదల పోస్ట్‌పోన్ అయ్యింది. అది విడుదల అవ్వకముందు తన తర్వాత చిత్రాలు అయిన ‘సలార్ 2’, ‘ఫౌజీ’ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టనున్నాడు ప్రభాస్.