TG Govt: తెలంగాణలోని 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసలే పరీక్షల కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులపై దృష్టి సారించిన ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
తెలంగాణలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అయితే పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు స్పెషల్ క్లాసులను ప్రభుత్వ పాఠశాలలో సైతం నిర్వహిస్తున్నారు. ఉత్తమ మార్కులు సాధించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది.
ఈ దశలో సాయంత్రం వేళ పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు స్నాక్స్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు కానుంది. ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లి పట్టి, మిల్లెట్ బిస్కెట్లు, ఆనియన్ పకోడీ, శనగలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: TTD News: కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు
ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 ల చొప్పున ఖర్చు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పదవ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండ, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది.