E-Paper
Advertisement

మంత్రులు చెప్పినా వినని జెన్‌కో బాసులు.. ఆ 21 మంది ఉద్యోగులపై ఎందుకంత కక్ష..?

మంత్రులు చెప్పినా వినని జెన్‌కో బాసులు.. ఆ 21 మంది ఉద్యోగులపై ఎందుకంత కక్ష..?
Advertisement

TGGENCO Promotions: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ జెన్ కో) లో 2018లో జెన్ కో సంస్థ హెచ్ఆర్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేసి మానవ వనరుల విధులను అప్పగించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో టీజీ జెన్ కో, టీజీ ట్రాన్స్ కో, టీజీ ఎస్పీ డీసీఎల్, టీజీ ఎన్ పీ డీసీఎల్‌లో పీ అండ్ జీ (పర్సనల్ అండ్ జనరల్) సర్వీస్ పరిధిలోనే పలువురు ఉద్యోగులు వివిధ క్యాడర్లలో మానవ వనరుల విభాగంలో విధులను నిర్వర్తిస్తున్నారు. కాగా టీజీ జెన్ కో సంస్థ పీ అండ్ జీ సర్వీస్‌కు సమాంతరంగా 2008లో హెచ్ఆర్ విభాగానికి సంబంధించిన సర్వీస్ రూల్స్‌ను ఏర్పాటు చేసింది.

ప్రమోషన్ల విధానం..

ఈ క్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కొరకు 2018 కి సంబంధించిన ప్రత్యక్ష నియామక నోటిఫికేషన్ ధ్వారా 21 పోస్టులను భర్తీ చేసింది. అయితే నిబంధనల ప్రకారం హెచ్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్లో చేరిన వారికి మొదటి ప్రమోషన్ రెండేళ్లలో, రెండవ ప్రమోషన్ ఐదేళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. టీజీ జెన్ కో లో పీ అండ్ జీ సర్వీస్ పరిధిలో సుమారు 100 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తుండగా పీ అండ్ జీ సర్వీస్ ప్రమోషన్ల విధానం, హెచ్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ల ప్రమోషన్ల విధానం వేరయినప్పటికీ,హెచ్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ల ప్రమోషన్లపై జాప్యం జరుగుతోంది.

ఉద్యోగుల ఆవేదన..

Advertisement

సర్వీస్ నిబంధన ప్రకారం రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించిన అనంతరం అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ నుంచి ప్రమోషన్ ఫై డిప్యూటీ మేనేజర్ పోస్ట్ కు వెళ్లాల్సి ఉంది. అయితే ఏళ్ళ తరబడి నిరీక్షించినా ప్రమోషన్ రాకపోవటంతో, గడిచిన నలుగేళ్లుగా ప్రమోషన్ల కోసం హెచ్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు కీలకమైన అధికారులతో పాటు, ముఖ్యమైన మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి మొరపెట్టుకున్నా ఫైల్ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కీలకమైన ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్ల విషయంలో న్యాయం జరిగే వరకూ ప్రభుత్వం తమ వైపు నిలబడాలని పలువురు కోరుతున్నారు.

Also read: Paperless Cabinet: తొలి పేపర్ లెస్‌గా తెలంగాణ కేబినెట్ సమావేశం.. మూసీ, మెట్రోపై కీలక నిర్ణయాలు

ఉత్తర్వులు జారీ..

Advertisement

జెన్ కో యాజమాన్యం సర్వీస్ రెగ్యులరైజేషన్ మేరకు హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్లకు ప్రమోషన్లు ఇవ్వకపోగా ఎంతో ఒత్తిడి చేస్తే డిప్యూటీ మేనేజర్లుగా ఇంచార్జ్ అరేంజ్ మెంట్ విధులు అప్పగించినప్పటికీ విద్యుత్ సౌద నుంచి జనరేటింగ్ స్టేషన్ కు మరియు ఒకరిద్దరిని జనరేటింగ్ స్టేషన్ నుండి ఇంకొక జనరేటింగ్ స్టేషన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీ అండ్ జీ ఉద్యోగులకు ఇంచార్జ్ అరేంజ్ మెంట్ విధులను అప్పగించే అంశంలో వెకెన్సీ లతో సంబంధం లేకుండా, విద్యుత్ సౌద, జనరేటింగ్ స్టేషన్స్ లోనే, ఎక్కడున్న వారిని అక్కడే రిటైన్ చేయగా హెచ్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్లను ఎక్కడ వెకెన్సీ ఉంటే అక్కడికే వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం.

ప్రమోషన్లపై స్పందించేనా

జెన్ కో సంస్థలో హెచ్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్లుగా కొనసాగుతున్న వారికి రూల్స్ ప్రకారం దక్కవలసిన ప్రమోషన్స్ పై జెన్ కో సంస్థ యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తుందా లేదా అన్న అంశం గత కొన్నేళ్లుగా సస్పెన్స్ గా మారింది. ప్రమోషన్ల విషయంలో 2025లో కోర్టుకు వెళ్లినప్పటికీ, అప్పటికే ప్రమోషన్ల పై కోర్టులో స్టే ఉండటం వలన ఆ ప్రయత్నం సైతం విఫలం అయింది. గత మార్చ్‌లో ఇంచార్జ్ అరేంజ్ మెంట్ కోసం జెన్ కో సంస్థకు 3 ఫైల్స్ సర్కులేషన్ చేయగా హెచ్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఫైల్ మినహా మిగిలిన రెండు ఫైల్స్ అప్రూవల్ కాగా యాజమాన్యం నుంచి మళ్లీ నిరాశే మిగిలింది. చివరకు ఇంచార్జ్ అరేంజ్ మెంట్ కోసం ఎంతో మొరపెట్టుకుంటే డిప్యూటీ మేనేజర్ గా అవకాశం ఇచ్చి వెంటనే జనరేటింగ్ స్టేషన్‌కు బదిలీ చేయటంతో హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్లకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది.

హఠాత్తుగా ట్రాన్స్ఫర్..

సరిసమానమైన విధులు నిర్వర్తించుచున్న అసిస్టెంట్ మేనేజర్ లను వారి సహోద్యోగులైన పీ & జీ సర్వీస్ వారితో సమానముగా పరిగణిస్తూ ఎక్కడి వారిని అక్కడే డిప్యూటీ మేనేజర్ లుగా కొనసాగిస్తారు అని భావించిన తరుణంలో, అందుకు భిన్నంగా వారి వారి కంట్రోలింగ్ ఆఫీసర్ ల అభ్యర్ధనలను సైతం పట్టించుకోకుండా, పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా, హఠాత్తుగా ట్రాన్స్ఫర్ చేయటం శోచనీయం. అసిస్టెంట్ మేనేజర్లకు మినహా అన్ని స్థాయిల ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కగా జెన్ కో సంస్థ హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్ల ప్రమోషన్లపై ఏ విధంగా స్పందిస్తుందన్నది అనేది వేచి చూడాల్సి ఉంది.

Also read: BJP Telangana: 30 ఏళ్ల సీనియర్లమని బిల్డప్ ఇస్తే కుదరదు.. తెలంగాణ బీజేపీ లీడర్లకు మైండ్ బ్లాక్ వార్నింగ్..?

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×